దిల్ రాజు-వేణుశ్రీరామ్ కాంబినేషన్ లో హీరో బన్నీ చేయాల్సిన సినిమా ఐకాన్. ఈసినిమాను సడెన్ గా ప్రకటించారు. అంతే సడెన్ గా పక్కన పెట్టారు. ఈ సినిమా ఆగిపోయిందనే ఇప్పుడు వార్తలు వున్నాయి. కానీ బన్నీకి సన్నిహితుడు, గీతాసంస్థ కీలక బాధ్యుడు అయిన బన్నీ వాస్ మాత్రం అలా కాదంటున్నారు. కేవలం ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారు తప్ప, పూర్తిగా క్యాన్సిల్ చేయలేదని వివరించారు.
బన్నీకి ఆ కథ చాలా నచ్చిందని, తాను ఎప్పుడో అప్పుడు, కాస్త గ్యాప్ చూసుకుని ఆ సినిమా చేస్తానని, ఆ కథ తనకోసం అలాగే వుంచాలని డైరక్టర్ వేణు శ్రీరామ్ ను కోరారని బన్నీ వాస్ వెల్లడించారు. నటుడిగా సంతృప్తి ఇచ్చి, మంచి పేరు తెచ్చేలాంటి కథ అది అని, అందుకే దాన్ని ఎప్పటికైనా బన్నీ చేస్తారని ఆయన అన్నారు.
నిజానికి కథ అద్భుతంగా నచ్చే బన్నీ కొన్ని నెలల క్రితం ఆ సినిమాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాదిరిగా ప్రకటించారు. కానీ ఎందుకో సడెన్ గా పక్కన పెట్టారు. ఇప్పుడు బన్నీవాస్ నటుడిగా తృప్తి ఇచ్చే పాత్ర, పేరు తెచ్చే సినిమా అంటున్నారు. అంటే ఇవన్నీ కలిపి చూస్తే, ఐకాన్ సినిమా లో కమర్షియల్ అంశాల పాళ్లు తక్కువ వున్నాయేమో? అందుకే తాత్కాలికంగా పక్కన పెట్టారేమో అని అనుమానించాల్సి వస్తోంది.
ఇదిలా వుంటే బన్నీ డైరీ 2022 వరకు ఫుల్ అయిపోయిందని బన్నీవాస్ తెలిపారు. సుకుమార్, మురుగదాస్ సినిమాలు వరుసగా వుంటాయన్నారు. ఈ రెండుసినిమాలతో మహా అయితే 2020 పూర్తవుతుంది. ఆపైన రెండేళ్లకు ఏం సినిమాల ప్లాన్ చేసినట్లో? సురేందర్ రెడ్డి సినిమా ఒకటి వుండే అవకాశం వుంది. మరి ఇంకెవరు వున్నారో?లైన్ లో?