లక్..బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో!వెంకీస్!

సితార బ్యానర్..2020..భీష్మ సినిమా. మాంచి హిట్. దర్శకుడు వెంకీ కుడుముల Advertisement అదే బ్యానర్. 2021..రంగ్ దే సినిమా. యావరేజ్ హిట్. అంతకు ముందు చేసిన మిస్టర్ మజ్జు కూడా ఫ్లాప్ సినిమానే. దర్శకుడు…

సితార బ్యానర్..2020..భీష్మ సినిమా. మాంచి హిట్. దర్శకుడు వెంకీ కుడుముల

అదే బ్యానర్. 2021..రంగ్ దే సినిమా. యావరేజ్ హిట్. అంతకు ముందు చేసిన మిస్టర్ మజ్జు కూడా ఫ్లాప్ సినిమానే. దర్శకుడు వెంకీ అట్లూరి.

గమ్మత్తేమిటంటే 2020 నుంచి సినిమా కోసం వేచి వున్నాడు వెంకీ కుడుముల హిట్ ఇచ్చి మరీ. పాపం, చేతిలోకి సినిమా రావడం లేదు. అదిగో..ఇదిగో అని రకరకాల కాంబినేషన్లు వినిపిస్తూనే వున్నాయి తప్ప సెట్ కావడం లేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్నది నితిన్ తో అని. అది ఎప్పటికి వుంటుందో తెలియదు.

కానీ ఓ ఫ్లాపు, ఓ యావరేజ్ ఇచ్చిన వెంకీ అట్లూరికి మాత్రం ధనుష్ దొరికేసాడు. ధనుష్ తో కూడా మరీ అద్భుతమైన సినిమా కాదు కానీ ఓకె మూవీ బయటకు వచ్చింది. కానీ మంచి రెవెన్యూ లాగేసింది. అంటే అదృష్టం ఈ వెంకీకి మామూలుగా లేదన్న మాట.

కానీ ఆ వెంకీ మాత్రం ఈ బ్యానర్..ఆ బ్యానర్..ఆ హీరో..ఈ హీరో అంటూ పాపం, అటు ఇటు తిరుగుతున్నారు. కానీ వర్కవుట్ కావడం లేదు. బ్యాడ్ అనుకోవాలేమో?

అయినా సినిమా ఇండస్ట్రీలో అంతే..హిట్ లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కొందరికి సినిమాల మీద సినిమాల వస్తూనే వుంటాయి..ఆ లాబీయింగ్..ఆ వ్యవహారం వేరే. హిట్ లు ఇచ్చినా పక్కన వుండిపోతుంటారు..వారికి ఇలాంటివి చాతకాదేమో? ఈ వెంకీ లే కాదు..ఇలాంటి వాళ్లు చాలా మంది వున్నారు.