నితిన్ ‘చెక్’ అఫీషియల్

వైవిధ్యమైన సినిమాలు అందించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో హీరో నితిన్ తో సినిమాను నిర్మిస్తోంది భవ్య క్రియేషన్స్ సంస్థ. చెక్ అన్నది ఈ సినిమా టైటిల్ అంటూ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.…

వైవిధ్యమైన సినిమాలు అందించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో హీరో నితిన్ తో సినిమాను నిర్మిస్తోంది భవ్య క్రియేషన్స్ సంస్థ. చెక్ అన్నది ఈ సినిమా టైటిల్ అంటూ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

ఇప్పుడు ఆ టైటిల్ నే అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఓ కేసు, జైలు, ఈ నేపథ్యంలో అల్లిన ఓ థ్రిల్లింగ్ కథ ఆధారంగా చెక్ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లు. 

టైటిల్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ''చదరంగం నేపథ్యంలో  సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది . ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశ లో ఉంది '' అని చెప్పారు. 

నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ- '' నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమాలో నితిన్ నటన మరో లెవెల్ లో వుంటుందని ఆయన అన్నారు.

కాపు ఓట్ల కోసమే దాసరి కార్డు వాడారా?

నన్ను దించాలని ట్రై చేస్తే నిజంగా హర్ట్ అవుతాను