ఆంధ్రప్రదేశ్…కులాల లెక్క

లెక్కేసి చెప్పు అంటే గుర్తు రాని, అసలు తెలియని కులాలు చాలా ఉన్నాయి. మన చుట్టూనే ఉంటారు. కులాల పట్టింపు ఉన్నవారికి తప్ప మిగతావారికి ఎవరు ఏ కులమో తెలియదు.  Advertisement బిసిల్లో నాలుగు…

లెక్కేసి చెప్పు అంటే గుర్తు రాని, అసలు తెలియని కులాలు చాలా ఉన్నాయి. మన చుట్టూనే ఉంటారు. కులాల పట్టింపు ఉన్నవారికి తప్ప మిగతావారికి ఎవరు ఏ కులమో తెలియదు. 

బిసిల్లో నాలుగు గ్రూపులు. ఒక్కో గ్రూపులో కనీసం ఓ యాభయ్ ఉప కులాలు. అలాగే ఎస్సి, ఎస్టీ జాబితాలు.  తిట్టుకోడానికి మాత్రమే పనికొచ్చే కులాలు కొన్ని. 

పేరే తెలియని కులాలకు 75 యేళ్ళ స్వతంత్ర భారత దేశంలో రాజకీయ ప్రాతినిధ్యం దొరికిన సందర్భాలు లేవు. ప్రతి కులంలో ఏ, బి, సి, డి జాబితాల్లో వేళ్ళమీద లెక్కబెట్టగలిగినన్ని కులాల పేర్లు మాత్రమే చెప్పగలం. 

ప్రతి జాబితాలోనూ ఏవో మూడు, నాలుగు కులాలే ఇన్నేళ్ళుగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. మిగతా కులాలలు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరంగానే ఉన్నాయి. 

జగన్మోహన్ రెడ్డి స్వచ్చంద సంస్థను నడపడం లేదు. ఆయన ఓ రాజకీయ పార్టీ నడుపుతున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయ లబ్ది కోసమే కావచ్చు. రాజకీయం అంటే వ్యూహం, ఎత్తుగడలు. 

గెలుపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం. అది కాదనలేం. 

కానీ ఖద్దరు చొక్కా తొడిగి చట్టసభలో అడుగు పెట్టే అవకాశం లేని కొన్ని కులాలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించడం చిన్న విషయమేం కాదు.  ఆ నిర్ణయం  అభినందనీయం. అందునా ఎలాంటి ఎన్నికా అవసరం లేకుండా ఎర్ర తివాచీ పరిచి సభలోకి తీసుకెళ్ళడం గొప్ప విషయమే. 

గతంలో కాస్తో, కూస్తో సామాజిక స్పృహ ఉన్న కాంగ్రెస్ నేతలు కొన్ని చిన్న కులాలకు ప్రాతినిధ్యం కల్పించిన చరిత్ర ఉంది. అయితే ఆ కులాల్లో కూడా చిన్న ఉప కులాలకు ప్రాతినిధ్యం కల్పించిన సందర్భం ఇప్పుడే కనిపిస్తోంది. 

చట్ట సభలో మొట్ట మొదటి సారి ప్రాతినిధ్యం దక్కించుకుని అడుగుపెట్టబోతున్న అతి చిన్న కులాల, ఉప కులాల నేతలకు అభినందనలు. అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. 

ఇంకా చాలా చిన్న కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. ఇంత పెద్ద పదవులు కాకపోయినా కనీసం మండల స్థాయి, జిల్లా స్థాయి పదవులతో అయినా మెయిన్ స్ట్రీమ్ లోకి అవకాశం ఆయా చిన్న కులాలు, వాటి ఉపకులాలకు వస్తుందని ఆశిస్తున్నా.

Gopi Dara, Senior Journalist