టీడీపీపై దాడి… ప‌వ‌న్ నో ట్వీట్!

తనవారికి సమస్య వస్తే కాస్త లేట్ అవుతుందేమో గాని అదే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కష్టం వస్తే క్షణం కూడా ఆలోచించకుండా ట్వీట్ చేసే పవన్ కళ్యాణ్.. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి…

తనవారికి సమస్య వస్తే కాస్త లేట్ అవుతుందేమో గాని అదే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కష్టం వస్తే క్షణం కూడా ఆలోచించకుండా ట్వీట్ చేసే పవన్ కళ్యాణ్.. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి ఘటనపై ట్వీట్ లేదా పిడిఎఫ్ ఏది పోస్ట్ చేయలేదు దీనికి బహుశా టీడీపీ అనుకూల వారాంతపు పత్రికలో ప్యాకేజీ ముద్ర ఎఫెక్ట్ క‌నిపిస్తోందంటు సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

టీడీపీ నేతలు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై అనుచిత‌ వ్యాఖ్యలు చేశారని వంశీ అనుచరులు గన్నవరం లోని టీడీపీ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియాలో వాపోతున్నా, దాడి జ‌రిగి దాదాపు 12 గంటల పైన అవుతున్న కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి ట్వీట్ వేయ‌కపోవడంపై పవన్ తమపై కోపంగా ఉన్నారని తమ అనుకూల పత్రికలో వార్త‌ల ఎఫెక్ట్ గ‌ట్టిగా త‌గిలిన‌ట్లు అనుమానిస్తున్నారు టీడీపీ శ్రేణులు.

గత రెండు రోజులుగా వారాంత పలుకుల పత్రిక అధినేతను ట్రోల్ చేస్తున్నా జన సైనికుల కోపంలో దృష్టిలో ఉంచుకొని ప‌వ‌న్ కొన్ని రోజులు టీడీపీకి అంటి ముట్టనట్లు ఉండడమే మంచిదని తీర్మానానికి వచ్చినట్లు భావిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు రియాక్ట్ కాకుండా టీడీపీపై దాడి అంటూ రియాక్ట్ అయితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని జ‌న‌సైనికుల కోపం కాస్తా చ‌ల్ల‌ర‌గానే చంద్ర‌బాబును పరామర్శించే ఛాన్స్ ఉందంటూన్నారు టీడీపీ శ్రేణులు. 

ఇప్ప‌టికే ఇరువురు కూడా ఇలాంటి టైంలోనే ఒక‌సారి చంద్ర‌బాబు ప‌వ‌న్ బ‌స చేసే హోట‌ల్ కు వెళ్లితే.. చంద్ర‌బాబు కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నే హైదారాబాద్ లోని బాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇరువురికి ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చిన ఓదార్చుకునే నేత‌ల‌ను ఒక్క వార్త దూరం చేసినట్లు ఉంది.