పూజా హెగ్డేలా మెరిసిపోవాలంటే…!

ప్రస్తుతం సౌత్ లో హాట్ హీరోయిన్ పూజా హెగ్డే. తన అందానికి సంబంధించిన చిట్కాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ బ్యూటీ. అందంగా కనిపించాలనుకునే అమ్మాయిలకు చిన్న చిన్న చిట్కాలు అందిస్తుంది.…

ప్రస్తుతం సౌత్ లో హాట్ హీరోయిన్ పూజా హెగ్డే. తన అందానికి సంబంధించిన చిట్కాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ బ్యూటీ. అందంగా కనిపించాలనుకునే అమ్మాయిలకు చిన్న చిన్న చిట్కాలు అందిస్తుంది. తాజాగా ఆమె మరోసారి తన బ్యూటీ టిప్స్ బయటపెట్టింది. తన బ్యాగ్ లో కచ్చితంగా ఉండే బ్యూటీ ఐటెమ్స్ తో పాటు.. మంచి నిగారింపు కోసం ఏం చేయాలో చెబుతోంది.

పూజా హెగ్డే కనురెప్పలు పెద్దగా ఉంటాయి. వాటిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు మస్కారా వాడుతుంటానని చెప్పుకొచ్చింది పూజ. తన బ్యాగ్ లో ఎప్పుడూ మస్కారా ఉంటుందని, అది తన గ్లామర్ ను రెట్టింపు చేస్తుందని తెలిపింది. 

ఇక మస్కారాతో పాటు మల్టీపర్పస్ మేకప్ షేడ్స్ కూడా తన బ్యాగ్ లో ఉంటాయని బయటపెట్టింది. అయితే మరీ గాఢమైన రంగులు కాకుండా, చూడ్డానికి సహజంగా కనిపించే కోరల్ కలర్ షేడ్స్ ను వాడితే బాగుంటుందని చెబుతోంది. ఈ షేడ్స్ వాడడం వల్ల ముఖం సహజంగా కనిపిస్తుందని, వీటిని పెదవులకు కూడా పట్టించొచ్చని చెబుతోంది.

వీటితో పాటు పూజాహెగ్డే బ్యాగ్ లో ఐబ్రో షాడోస్ కచ్చితంగా ఉంటాయి. కనుబొమ్మలు, కనురెప్పలు, పెదవులు, ముఖం స్కిన్ టోన్.. ఈ 4 అంశాలకు సంబంధించిన సామగ్రిని బ్యాగ్ లో ఉంచుకుంటే.. ఎలాంటి టైమ్ లోనైనా అందంగా కనిపించొచ్చని చెబుతోంది.

వేసుకున్న దుస్తులు వెస్ట్రన్ అయినా, ట్రెడిషనల్ అయినా.. పైన చెప్పిన మేకప్ మాత్రం ఎప్పుడూ మారదని.. ఈ బ్యూటీ టిప్స్ పాటిస్తే.. మెరిసిపోవచ్చని చెబుతోంది పూజా హెగ్డే. సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.