శ్యామ్ సింగం..హ్యాపీ మోడ్

ఏ సినిమా అయినా బాగా వస్తే హ్యాపీ…విడుదలకు ముందే అన్ని విధాలా అమ్ముడైపోతే ఇంకా హ్యాపీ. ఆ లెక్కలో నాని శ్యామ్ సింగ రాయ్ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే విడుదల ఇంకో రెండు వారాల్లో…

ఏ సినిమా అయినా బాగా వస్తే హ్యాపీ…విడుదలకు ముందే అన్ని విధాలా అమ్ముడైపోతే ఇంకా హ్యాపీ. ఆ లెక్కలో నాని శ్యామ్ సింగ రాయ్ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే విడుదల ఇంకో రెండు వారాల్లో వుంది అనగానే అన్ని విధాలా నాన్ థియేటర్ అమ్మకాలు పూర్తి చేసుకున్నారు.

డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్, అడియో అన్నీ కలిసి 30 కోట్లు సంపాదించారు. అందుకే హ్యాపీ మోడ్. అయితే సినిమాకు తక్కువేమీ కాలేదు. యాభై కోట్లకు పైగా బడ్ఙెట్ తో తయారయిందీ సినిమా. 

నాన్ థియేటర్ రాబడి పోనూ ఇంకా ఇరవై కోట్లు థియేటర్ మీద నుంచి రావాల్సి వుంది. ఆంధ్ర 12 కోట్ల రేషియోలో రెగ్యులర్ బయ్యర్ల దగ్గర పెట్టారు. ఇక మిగిలింది నైజాం నుంచే మాగ్ఙిమమ్ రావాలి. 

సీడెడ్ నుంచి కొద్దిగా వుంటుంది. సినిమాకు వున్న బజ్, క్రిస్మస్ సీజ‌న్ కలిపి సేఫ్ జోన్ కు వెళ్లిపోతామనే ధీమా వుంది నిర్మాత వెంకట్ బోయనపల్లికి. సినిమాలో సాయిపల్లవి వుండడం ఓ ప్లస్. పాయింట్ కూడా.