28న ‘అల’ మ్యూజికల్ నైట్

సంక్రాంతికి వస్తున్న భారీ క్రేజీ సినిమాల్లో అల వైకుంఠపురములో ఒకటి. త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో హారిక హాసిని నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. ఒక్క పాట రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించాల్చి వుంది.…

సంక్రాంతికి వస్తున్న భారీ క్రేజీ సినిమాల్లో అల వైకుంఠపురములో ఒకటి. త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో హారిక హాసిని నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. ఒక్క పాట రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించాల్చి వుంది. ఇప్పటికే సినిమాలో విడుదలైన పాటలు భయంకరమైన క్రేజ్ సంపాదించాయి. సినిమాకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాల్సి వుంది.

అయితే అల వైకుంఠపురములో కోసం రెండు ఫంక్షన్లు ప్లాన్ చేస్తున్నారు. ఒకటి భారీ మ్యూజికల్ నైట్ హైదరాబాద్ లో, రెండవది భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖలో. ఒకటి ఈ నెల 28న జరుగుతుంది. రెండవది జనవరి 5న విశాఖలో జరుగుతుంది. రెండింటికి వెన్యూలు ఫిక్స్ కావాల్సి వుంది.

హైదరాబాద్ లో జరిగే మ్యూజికల్ నైట్ లో ఆల్ మోస్ట్ ఆల్ట్ టాప్ సింగర్స్ అంతా పాల్గొంటారు. వీరంతా రకరకాల పాటలు పాడతారు. కేవలం అలవైకుంఠపురములో పాటలే కాదు. అదే విధంగా రెండు సడెన్ సర్ప్రయిజ్ లు ఈ ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. 

విశాఖలో జరిగే ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యే అవకాశం వుంది. ఎవరు అతిథి అన్నది ఇతమిద్దంగా తెలియదు కానీ చాలా ప్రత్యేకంగా ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. విశాఖ ఈవెంట్ జరిగే జనవరి 5న హైదరాబాద్ లో మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.