బాబు బలహీనతని గుర్తించిన వైసీపీ..!

చంద్రబాబుకి పెద్ద బలహీనత కుప్పం. అక్కడి పరాజయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తొలిసారిగా కన్నీటి డ్రామా ఆడారు. ఇక కుప్పంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు ఓడిపోతే ఆ గుండె తట్టుకుంటుందా..? అస్సలు తట్టుకోలేదు.  Advertisement…

చంద్రబాబుకి పెద్ద బలహీనత కుప్పం. అక్కడి పరాజయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తొలిసారిగా కన్నీటి డ్రామా ఆడారు. ఇక కుప్పంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు ఓడిపోతే ఆ గుండె తట్టుకుంటుందా..? అస్సలు తట్టుకోలేదు. 

అందుకే ఇప్పుడు బాబు బలహీనతనపై గురిచూసి కొడుతున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుని పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. తనపై పోటీ చేయాలంటూ గతంలో చంద్రబాబుకి సవాల్ విసిరిన పెద్దిరెడ్డి, ఇప్పుడు తన తమ్ముడి కొడుకుని బాబుకి పోటీగా కుప్పం బరిలోకి దింపాలనుకుంటున్నారు.

అపోహలు తొలగిపోయాయి..

కుప్పం చంద్రబాబు నియోజకవర్గం కావడంతో, అది టీడీపీకి కంచుకోట అనే  అపోహతో ఇప్పటివరకూ ఎవరూ అక్కడ గట్టిగా ఫోకస్ పెట్టలేదు. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా అక్కడ ఆ పార్టీకి బలం పెరుగుతూ వచ్చింది. స్థానికంగా చంద్రబాబుపై వ్యతిరేకత ఉందనే వాస్తవం తెలిసొచ్చింది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు తప్పులు బాగా బయటపడ్డాయి. ఇంకాస్త కష్టపడితే కుప్పంలో బాబు కూసాలు కదిలించడం అసాధ్యమేమీ కాదనే అభిప్రాయం వచ్చింది.

ఈ క్రమంలో చంద్రబాబుపై వరుసగా పోటీ చేస్తున్న చంద్రమౌళి హఠాన్మరణంతో అక్కడ గ్యాప్ వచ్చినట్టయింది. అయితే చంద్రమౌళి కుమారుడు భరత్ ఆ లోటు భర్తీ చేస్తారని అనుకున్నారు. అనూహ్యంగా భరత్ కి ఎమ్మెల్సీ అవకాశమిచ్చింది వైసీపీ. దీంతో అక్కడ భరత్ కి మరింత పలుకుబడి పెరిగింది. స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఓ అవకాశం కలిగింది. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలోచన మరోలా ఉందని తెలుస్తోంది. 

ఆయన తమ్ముడి కొడుకు సుధీర్ రెడ్డిని కుప్పం నుంచి బరిలో దింపాలని చూస్తున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భరత్ ఎమ్మెల్సీగా వెళ్లిపోయారు కాబట్టి, తన వారసుడిగా చంద్రబాబుపై పోటీకి సుధీర్ రెడ్డిని సిద్ధం చేస్తున్నారు పెద్దిరెడ్డి. త్వరలో ఆయన్ను కుప్పం వైసీపీ ఇంచార్జిగా ప్రకటించే అవకాశాలున్నాయి.

చిత్తూరు జిల్లాపై చంద్రబాబు కంటే పెద్దిరెడ్డికే ఎక్కువ పట్టు ఉందని సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఇటీవల స్థానిక ఎన్నికల విషయంలో కూడా రుజువైంది. చంద్రబాబుని కుప్పంలో ఓడించడం ద్వారా దాన్ని శాశ్వతం చేయాలనుకుంటున్నారు పెద్దిరెడ్డి. వచ్చే ఎన్నికలనాటికి కుప్పంలో టీడీపీని దెబ్బకట్టాలనే ప్రణాళికను అమలు చేస్తున్నారు.

ఇప్పటికే స్థానిక ఎన్నికలతో చంద్రబాబుకి పెద్ద షాకిచ్చారు. సాక్షాత్తూ కుప్పం మున్సిపాలిటీలోనే వైసీపీ జెండా ఎగిరింది. ఇక చంద్రబాబు చేసేదేం లేక, అసెంబ్లీలో అలిగి, బయటకొచ్చి ఏడ్చి నానా రభస చేశారు. కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం ఓసారి చూడాలని జగన్ కూడా అన్నారంటే ఆ ఫలితాలను వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

మున్సిపాల్టీ కోల్పోతేనే అంత రాద్దాంతం చేసిన బాబు, ఇక ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇంకెంత కుంగిపోతారో చెప్పక్కర్లేదు. అదే బాబుకి రాజకీయ సమాధి. దాని కోసమే ఒక్కో ఇటుక పేరుస్తున్నారు పెద్దిరెడ్డి.