బ్రేకింగ్: నంద‌మూరి తార‌క‌ర‌త్న క‌న్నుమూత‌

శివ‌రాత్రి ప‌ర్వ‌దినం రోజు నంద‌మూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. లోకేష్ పాద‌యాత్ర మొద‌టి రోజులో గుండెపోటుతో కుప్ప‌కూలిన తార‌క‌ర‌త్న‌ బెంగుళూరు ఆస్ప‌త్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందారు. Advertisement దాదాపు 23 రోజులుగా బెంగళూరులోని…

శివ‌రాత్రి ప‌ర్వ‌దినం రోజు నంద‌మూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. లోకేష్ పాద‌యాత్ర మొద‌టి రోజులో గుండెపోటుతో కుప్ప‌కూలిన తార‌క‌ర‌త్న‌ బెంగుళూరు ఆస్ప‌త్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందారు.

దాదాపు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్ప‌త్రిలో ఆయనకు వైద్యం అందుతోంది. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించ‌లేదు.

ఎన్టీఆర్ త‌న‌యుడైన నంద‌మూరి మోహ‌నకృష్ణ కూమారుడే తార‌క‌ర‌త్న.. ఒక‌టో నెం 1 చిత్రంతో హీరోగా వెండితెర‌పైకి రంగ‌ప్ర‌వేశం చేసిన ఆయ‌న‌ దాదాపు 20 సినిమాల‌కు పైగా హీరోగాను, కొన్ని సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడిగా కూడా న‌టించారు. అమ‌రావ‌తి సినిమాలో విల‌న్ గా మంచి గుర్తింపు వ‌చ్చింది.. ఆ సినిమాలో ఉత్త‌మ విల‌న్ గా నంది అవార్డును కూడా అందుకున్నారు.