ఇంత చెత్త పోలికేంటి బాలయ్య!

స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడుతారో ఆయనకే తెలీదు. మైక్ అందుకుంటే ఎక్కడ్నుంచి మొదలుపెట్టి ఎటు వెళ్తారో కూడా తెలీదు. అందుకే బాలయ్య ప్రసంగాలు కామెడీ పీస్ లుగా మారుతుంటాయి. గత తెలంగాణ ఎన్నికల్లో “హే…

స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడుతారో ఆయనకే తెలీదు. మైక్ అందుకుంటే ఎక్కడ్నుంచి మొదలుపెట్టి ఎటు వెళ్తారో కూడా తెలీదు. అందుకే బాలయ్య ప్రసంగాలు కామెడీ పీస్ లుగా మారుతుంటాయి. గత తెలంగాణ ఎన్నికల్లో “హే బుల్ బుల్” అంటూ బాలయ్య పాట అందుకుంటే అది కామెడీలో ఆణిముత్యంగా మారింది.

ఈసారి కామెడీ చేయకపోయినా ఓ చెత్త పోలిక తీసుకొచ్చారు బాలయ్య. మహిళలు, సినిమాలు ఒకటేనట. ప్రేమించాలి కానీ వ్యామోహం చెందకూడదట. విశాఖలో జరిగిన రూలర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇలా చెత్త పోలికను తెరపైకి తీసుకొచ్చారు బాలయ్య. దీంతో సభలో అంతా తలగోక్కున్నారు.

“సినిమా అంటే నాకు పిచ్చి లేదు, ప్యాషన్ ఉంది. పిచ్చి వేరు ప్యాషన్ వేరు. ప్రేమించడం వేరు, ప్రేమించడం బదులు ఇంకా ఏవేవో చేస్తున్నారు. సమాజంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా దృష్టిలో మహిళ-సినిమా ఒకటే. దాన్ని మనం ప్రేమించాలంతే. దాని మీద మనకు పిచ్చి, వెర్రి, వ్యామోహం అనేది ఉండకూడదు.”

చూశారుగా..మహిళల్ని, సినిమాల్ని ఇలా కంపేర్ చేస్తూ ఏదేదో మాట్లాడేశారు బాలయ్య. ఈ సందర్భంగా రూలర్ లో తన లుక్ పై కూడా స్పందించారు ఈ నటుడు. గ్రాఫిక్స్ చేశారని కొంతమంది, కొవ్వును బయటకు తీసేసే ఆపరేషన్ చేయించుకున్నానని మరికొందరు రకరకాలుగా అనుకున్నారని.. కానీ తను మాత్రం కష్టపడి బరువు తగ్గానని, కొత్త లుక్ లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. ఎప్పట్లానే ఈసారి కూడా బాలయ్య తన ప్రసంగాన్ని ఎక్కడో మొదలుపెట్టి, ఇంకెక్కడో ముగించారు.

జనాలు పోటెత్తుతారనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఏర్పాటుచేసిన ఈ వేడుక తుస్సుమంది. పదుల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటుచేస్తే కేవలం 2 గ్యాలరీలకు సరిపడా జనాలు మాత్రమే వచ్చారు. బాలయ్య ప్రసంగానికి భయపడి రాలేదా లేక చలి ఎక్కువగా ఉండడం వల్ల జనాలు రాలేదా అనేది సమాధానం లేని ప్రశ్న.

Click Here For Photo Gallery