బిగ్‌బాస్ రియాల్టీ షోలో వ్యవహారాలు, కంటెస్టెంట్ల తీరుపై నటి మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. అదొక కామకలాపాల కేంద్రంగా ఆమె అభివర్ణించారు. ఈ మేరకు తన ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా షణ్ముక్-సిరి సంబంధాలపై ఆమె ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పనిలో పనిగా హోస్ట్ నాగార్జునపై విరుచుకుపడ్డారు. బిగ్‌బాస్‌కు రూ.100 కోట్ల జరిమానా వేయిస్తానని మాధవీ హెచ్చరించడం గమనార్హం.
షణ్ముఖ్ పదే పదే సిరి వ్యక్తిత్వం గురించి నీచంగా కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్గు అంటూ సిరి తల్లి మాటలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కంటి చూపులతో ఆమెను కంట్రోల్ చేస్తున్నాడు. ఇక నిన్నటి ఎపి సోడ్‌లో అయితే సిరిపై మరింత సీరియస్ అయ్యాడు షణ్ముఖ్. ఆమెతోపాటు.. ఆమె తల్లి మాటలను కూడా తప్పు అంటూ వాదించాడు.
“ఏమయ్యా బిగ్ బాస్.. సిగ్గులేని టీమ్ మీది.. ఆ బిగ్ బాస్ హౌస్‌లో ఏంటా అరాచకం. ఒక ఆడపిల్లను బానిసను చేసి నవ్వకూడదు, ఏడ్వకూడదు, వంగకూడదు అనే మానసిక ఆత్యాచారం చేస్తుంటే.. ఎవడో పెళ్లాన్ని ఇంకొకడు డామినేట్ చేస్తుంటే.. వీకెంట్ ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మావ ఏమో అబ్బా ఏంట్రా ఇది అంటూ వగలు పోయి.. అమ్మా వద్దు అన్న హగ్గులు ఇప్పిస్తూ.. మీ ఫుటేజ్ కోసం ఆఖరికి నాగార్జున ని కూడా దిగజార్చిన మీకు టీఆర్పీ లేక ఏడుస్తున్నారు.
ఒక కన్నతల్లి మాటని విలువ లేకుండా చేసిన. కూతురిని సపోర్ట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మా నాగ్ మావా.. ఏందండీ ఈ అరాచకం ఏందీ అంటా? అలాంటి ఎదవలకు బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. వాడికే కప్ తగలబెట్టి మీ బిగ్ బాస్ సెట్ కూడా తగలబెట్టండి. ఇలాంటి వాడికి కీరిటం పెడితే మీ బీబీ కొంపకి పైర్ యాక్సిడెంట్ అయి తర్వాత నిమిషంలో తగలబడి పోతుంది చూడండి.. అసలు సమాజానికి ఏం చూపిస్తున్నారు ? యూత్ లో హగ్స్ అండ్ కిస్ లు తప్పేం కాదు.. పక్కోడి పెళ్లాన్ని హగ్ చేసుకోవచ్చు అంటున్నారు. నాతో వాదిస్తున్నారు తప్పేంటని.
స్నేహం ముసుగులో కామ కలపాలు చూడలేకున్నాం. మీ బీబీ టీం చివరి ఎపిసోడ్ చూసి..మీ నిర్ణయం సమాజనికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షో పై డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో కేసు వేస్తారు. హైకోర్టులో కూడా వేస్తాను. ఇది జోక్ కాదు.. సీరియస్.. టైంపాస్ కోసం టీవీ చూద్దామంటే అవమానాలే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలిసి చూడాలంటే సిగ్గుగా ఉంది. చెవిపై.. మెడపై.. హార్ట్ పై ముద్దులు పెట్టుకుంటే చూడటానికి అసహ్యంగా ఉంది. అడల్ట్ షో చూస్తున్నామా అనే ఫీలింగ్. ఓటీటీలో పర్సనల్ గా చూసే షోలా ఉంది.. తగలబెట్టండి సర్ బీబీ 5 వరస్ట్ టీం.. వరస్ట్ షో” అని మాధవీలత తనదైన స్టైల్లో విరుచుకుపడింది.
సమాజ ఆలోచనలను ప్రతిబింబించేలా మాధవీలత పోస్టు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహం ముసుగులో కామ కలపాలు చూడలేకున్నాం అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని లైట్‌గా తీసుకోడానికి వీల్లేదు. హౌస్‌లో కొన్ని జంటల వ్యవహారాలు మరీ శృతి మించాయనేది పౌర సమాజం ఆరోపణ. మాధవీలత చెబుతున్నట్టు…సిరి తల్లి మాటలను హౌస్‌లో కూతురితో పాటు ఆ యువతి స్నేహితుడు షణ్ముక్ కూడా ట్రోలింగ్ చేస్తున్నట్టు పదేపదే ఫ్రెండ్షిప్ హగ్ అంటూ వెటకారం చేయడం జనానికి నచ్చడం లేదు.
ఇదే వారిపై ప్రేక్షకుల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. కేవలం యూట్యూబర్‌గా షణ్ముక్ పాపులర్ కావడంతో ఆ మాత్రమైనా హౌస్‌లో నెట్టుకొస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మాధవీలత పోస్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.