టాలీవుడ్ లో బ్యాచిలర్స్ హీరోల్లో ఒకరు నితిన్. ఇతడు సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పుడు ఇంకా నిక్కర్లు వేసుకున్న పిల్లలు చాలామందికి కూడా ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యి ఉంటాయి. దాదాపు పదిహేడేళ్ల కిందట నితిన్ సినిమా కెరీర్ మొదలైంది. ఇప్పటి వరకూ ఇతడు బ్యాచిలర్ గానే ఉన్నాడు.
కెరీర్ కొన్నాళ్లు గతుక్కుల్లో ప్రయాణించినా ఆ తర్వాత నితిన్ నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు స్టడీగా సాగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో నితిన్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్ల కిందట నితిన్ గురించి ఒక గాసిప్ వినిపించింది.
తన సహచర హీరోయిన్ ఒకమ్మాయితో ఇతడు ప్రేమలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. వీరిద్దరూ వరసగా రెండు సినిమాల్లో నటించడంతో ఆ పుకార్లకు ఊపు వచ్చింది. అయితే నితిన్ ఆ ప్రచారాన్ని ఖండించాడు.
ఇప్పుడు నితిన్ పెళ్లి వార్తలు వస్తున్నాయి. ఈ హీరో పెళ్లి చేసుకోబోయేది ఒక తెలుగమ్మాయినే అని కూడా తెలుస్తోంది. ఆ అమ్మాయెవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో విదేశంలో నితిన్ పెళ్లి జరగబోతోందని సమాచారం!
మొత్తానికి టాలీవుడ్ హీరోల్లో బ్యాచిలర్స్ లో ఒకరిగా ఉన్న నితిన్ ఒక ఇంటి వాడు కాబోతున్నట్టున్నాడు.