వైసీపీలో మరో మారు సీరియస్ గానే డిస్కషన్ సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ తొందరలో ఉండొచ్చు అని అంటున్నారు. నలుగురైదుగురుని తప్పిస్తారు అని అంటున్నారు. అందులో ఉత్తరాంధ్రా నుంచి ఒక మంత్రి ఉంటారని ప్రచారం సాగుతోంది. ఆ మంత్రి శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ సీదరి అప్పలరాజు అని తెలుస్తోంది.
ఆయన పలాసా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిగా ఉంటూ నియోజకవర్గం పార్టీ పటిష్టత విషయంలో కొంత అలసత్వం చూపారని అంటున్నారు. మంత్రిగానూ పనితీరులో మార్కులు మంచిగా పడలేదని అంటున్నారు. అప్పట్లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను తప్పించి ఆయనకు సేం సామాజికవర్గం అని చాన్స్ ఇచ్చారు. దాంతో లక్కీ మినిస్టర్ గా సీదరి అప్పలరాజు గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇపుడు నియోజకవర్గంలో లుకలుకలు ఉన్నాయని మంత్రి వాటిని సెట్ చేసుకోలేకపోతున్నారు అన్నది ప్రచారంలో ఉన్న మాట. ఇక ఆయనకు వ్యతిరేకవర్గం కూడా సొంత నియోజకవర్గంలో పార్టీలో బలంగా ఉంది అని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ముందు ఎమ్మెల్యేగా పనితీరు మెరుగుపరచుకునేందుకే మంత్రిగా బాధ్యతల నుంచి తప్పిస్తారు అని ప్రచారం సాగుతోంది.
బడ్జెట్ సమావేశాల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని టాక్. ఈ ప్రచారం కనుక నిజమైతే ఉత్తరాంధ్రాలో మంత్రిగారికి గండమే అని అంటున్నారు. ఆయన్ని తప్పిస్తే కనుక ఉత్తరాంధ్రాలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో అన్న ఆసక్తి కూడా ఉంది.