ప్రపంచంలో తొలిసారి…

కాలం ఒకేలా వుండదు. మార్పులు అనివార్యం. ఇలాగే సాగాలని రాజ్యాంగం వుండదు. వున్నా మార్చుకోవచ్చు. యుఎఈ అనబడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అదే చేస్తోంది. ఇన్నాళ్లుగా అరబ్ దేశాల్లో వున్న వీకెండ్ సిస్టమ్ ను…

కాలం ఒకేలా వుండదు. మార్పులు అనివార్యం. ఇలాగే సాగాలని రాజ్యాంగం వుండదు. వున్నా మార్చుకోవచ్చు. యుఎఈ అనబడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అదే చేస్తోంది. ఇన్నాళ్లుగా అరబ్ దేశాల్లో వున్న వీకెండ్ సిస్టమ్ ను సమూలంగా మార్చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.

ఇన్నాళ్లూ శుక్ర, శనివారాలు వీకెండ్ అయితే ఇప్పుడు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు అంటే రెండున్నర రోజులు వీకెండ్ నే. అంటే కేవలం నాలుగున్నర రోజులు మాత్రమే పనిదినాలు. 

వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ సంస్థలు, విభాగాలన్నీ ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ..  ప్రపంచంలో నాలుగున్నర రోజుల పని విధానాన్ని పాటిస్తున్న తొలి దేశం ఇదే కావడం విశేషం.

మిగిలిన ప్రపంచం పాటిస్తున్న ఆదివారం సెలవు రోజును తము కూడా పాటించడం, అదే సమయంలో అన్ని వ్యాపార కార్యాలయ వ్యవహారాలకు శుక్రవారం సెలవు అన్నది ఇబ్బందిగా మారకుండా చూడడం వంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.