పాపం చంద్రబాబు.. రిలాక్స్ అయ్యే గతి లేదు!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్ధక్యంలో కూడా చెమటోడ్చి కష్టపడాల్సి వస్తోంది. ఆయన జీవితానికి ఇవి చివరి ఎన్నికలు.. నాకు లాస్ట్ చాన్స్ ఇవ్వండి అని ఆయన ఒక వైపు మొత్తుకుంటున్నప్పటికీ కూడా.. ప్రజలు ఆదరిస్తున్నారో…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్ధక్యంలో కూడా చెమటోడ్చి కష్టపడాల్సి వస్తోంది. ఆయన జీవితానికి ఇవి చివరి ఎన్నికలు.. నాకు లాస్ట్ చాన్స్ ఇవ్వండి అని ఆయన ఒక వైపు మొత్తుకుంటున్నప్పటికీ కూడా.. ప్రజలు ఆదరిస్తున్నారో లేదో తెలియదు. తనకు ముసలితనం వచ్చేసిందని బాగా గుర్తించిన చంద్రబాబునాయుడు కాసింత రిలాక్స్ కావడానికి కూడా ఆయనకు అవకాశం లేకుండా పోతోంది. 

పుత్రరత్నానికి కీఇచ్చి వదిలిపెడితే.. రోజూ నాలుగు ఊర్లు తిరుగుతూ.. జగన్ ప్రభుత్వం మీద బురద చల్లుతూ నానా యాగీ చేస్తూ ఉంటాడని, తాను కొన్ని నెలల పాటు నిమ్మళంగా ఒకేచోట కూర్చుని.. రాజకీయ కుట్రలు, వ్యూహాలు సిద్ధం చేయవచ్చునని చంద్రబాబునాయుడు అనుకున్నారు. అయితే ఆయన కోరిక తీరేలా లేదు. ఆయనకు రిలాక్స్ అయ్యే గతిలేదని అర్థమైపోతోంది. 

ఎందుకంటే చంద్రబాబునాయుడు తాజాగా మళ్లీ ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మూడురోజుల యాత్రకు సిద్ధమయ్యారు. ఒకవైపు కొడుకు పాదయాత్రలో ఉండగా, మరోవైపు తండ్రి ఇంకో ప్రాంతంలో ఈ యాత్ర చేయడం విశేషం. అయితే, నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర విఫలం అయిన నేపథ్యంలో.. లోకేష్ చెబుతున్న గాలి మాటలు ప్రజలకు రీచ్ కాకుండా విఫలం అవుతున్న నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు మళ్లీ ప్రజల ఎదుటకు ఈ కొత్త యాత్రలను ప్రారంభిచినట్లుగా.. పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే దానిని ఒక స్వల్పకాలిక కార్యక్రమంలాగా చంద్రబాబునాయుడు గతంలో ప్రారంభించారు. సుమారుగా రెండు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, రాష్ట్రంలో అందరు ప్రజల ఇంటింటికీ వెళ్లి.. వారి కష్టనష్టాలను తెలుసుకుని నమోదు చేసుకోవాలని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి దృష్టిసారించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్దేశించారు. 

ఒక రకంగా చెప్పాలంటే మేనిఫెస్టో రూపకల్పన కోసం సర్వేలాంటి కార్యక్రమం అన్నమాట. అంతే తప్ప.. ఎన్నికల దాకా జగన్ ను తిడుతూ సభలు నిర్వహిస్తూ పోవడం అనేది దీని లక్ష్యం కాదు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే లోకేష్ పాదయాత్ర ఉంటుంది కాబట్టి.. ప్రజల్లో జగన్ వ్యతిరేక వేడి అలాగే ఉంటుందని తాము లాభపడగలం అని ఊహించారు.

కానీ, వాస్తవంలో బెడిసి కొట్టింది. అసమర్థుడైన కొడుకు ఉన్నందుకు ఇంత ముసలితనంలో కూడా చంద్రబాబునాయుడు మళ్లీ కష్టపడాల్సి వస్తోంది. లోకేష్ పాదయాత్ర ప్రజలపై ఎలాంటి ప్రభావమూ చూపలేకపోతుండగా.. చంద్రబాబు మళ్లీ ఇదేంఖర్మ సభలు, యాత్రలు ప్రారంభిస్తున్నారు.  కొడుకు చేతగానితనం అనేది ఆయన గతిలేనితనానికి కారణమవుతున్నదని ప్రజలు భావిస్తున్నారు.