వినరో భాగ్యము బన్నీ వాస్ వ్యథ

గీతాఆర్ట్స్2 బ్యానర్ కెరటంలా దూసుకొచ్చింది. ఇలా బ్యానర్ పెట్టారో లేదో అలా వరుసపెట్టి హిట్స్ వచ్చాయి. భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, ప్రతిరోజూ పండగే లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి వచ్చినవే. ఈ…

గీతాఆర్ట్స్2 బ్యానర్ కెరటంలా దూసుకొచ్చింది. ఇలా బ్యానర్ పెట్టారో లేదో అలా వరుసపెట్టి హిట్స్ వచ్చాయి. భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, ప్రతిరోజూ పండగే లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి వచ్చినవే. ఈ సినిమాలతో బన్నీ వాస్ పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే, అప్పటివరకు 'గీతా' మనిషిగా, అల్లు అర్జున్ రైట్ హ్యాండ్ గా ఉన్న వాసు.. ఆ తర్వాత గీతాఆర్ట్స్2 తో నిర్మాతగా మారాడు.

ఇలా రావడంతోనే సక్సెస్ ఫుల్ బ్యానర్, సూపర్ హిట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు బన్నీ వాస్. అయితే అదే ఊపులో అతడు ఓకే చేసిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి. చావు కబురు చల్లగా సినిమాతో ఈ ఫ్లాపుల పరంపర మొదలైంది.

ఆ సినిమా కథను అంచనా వేయడంలో బన్నీ వాస్ ఫెయిలయ్యాడు. ఆ తర్వాతొచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఉన్నంతలో ఓకే అనిపించుకున్నప్పటికీ, ఆ వెంటనే మళ్లీ ఫ్లాప్. యూవీతో కలిసి గోపీచంద్-మారుతి కాంబోలో తీసిన పక్కా కమర్షియల్ అనే సినిమా డిజాస్టర్ అయింది.

ఆ తర్వాతొచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా అల్లు శిరీష్ స్థాయిలో ఓకే అనిపించుకుంది తప్ప, జీఏ2 గత వైభవాన్ని తీసుకురాలేకపోయింది. ఇక లేటెస్ట్ దెబ్బ 18-పేజెస్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటు నిఖిల్ స్టార్ డమ్, అటు సుకుమార్ బ్రెయిన్ ఉన్నప్పటికీ, బన్నీ వాస్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గీతగోవిందం, భలే భలే మగాడివోయ్ సినిమాల తరహాలో యునానిమస్ రిపోర్ట్స్ అందుకోలేకపోయాడు.

ఇలా నిర్మాతగా కిందామీద పడుతున్న టైమ్ లో వస్తోంది వినరో భాగ్యము విష్ణుకథ. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా అతడి కెరీర్ నే కాదు, బన్నీ వాస్ జాతకాన్ని కూడా నిర్దేశించబోతోంది. ఈ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లో హిట్ కొట్టాల్సిన స్టేజ్ కు వచ్చేశాడు ఈ ప్రొడ్యూసర్.

తనకున్న పరిచయాలు, 'గీతా' సపోర్ట్ తో సినిమాల్ని బాగానే మార్కెట్ చేసుకుంటున్నాడు బన్నీ వాస్. కానీ విజయం సాధించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. సినిమాలో విషయం ఉండాలి. కనీసం 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమా అయినా బన్నీ వాస్ జడ్జిమెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తుందేమో చూడాలి.