అన్నీ ఫేక్ వార్తలే

ఏ మొగుడు లేకపోతే అప్ప మొగుడే గతి అన్నట్లుగా వుంది..సినిమా వార్తలకు కరువు వచ్చింది. ఫిబ్రవరి డల్ సీజ‌న్. ఇటు సినిమాలకు అటు వార్తలకు కూడా. అందుకే ఇక ఏదో ఒకటి పుట్టించి వదిలేస్తే…

ఏ మొగుడు లేకపోతే అప్ప మొగుడే గతి అన్నట్లుగా వుంది..సినిమా వార్తలకు కరువు వచ్చింది. ఫిబ్రవరి డల్ సీజ‌న్. ఇటు సినిమాలకు అటు వార్తలకు కూడా. అందుకే ఇక ఏదో ఒకటి పుట్టించి వదిలేస్తే సరి అన్నట్లుంది పరిస్థితి. 

రెండు రోజుల క్రితం ఓ హీందీ సినిమాలో బన్నీ స్పెషల్ రోల్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. తీరా చేసి కనుక్కుంటే అస్సలు ఆవగింజంత నిజం లేదని తెలిసింది. పోనీ ఖండించవచ్చు కదా అంటే..అలా ఖండిస్తే, అదిగో బన్నీ ఖండించారంటూ ఇంకా మరిన్ని వార్తలు వస్తాయి. అందుకే అలా వదిలేస్తే బెటర్ అని వదిలేసారు అంటూ వివరంగా తెలిసింది. అదీ పాయింటే కదా.

త్రివిక్రమ్ తరువాత ఎన్టీఆర్ తో పౌరాణికం అంటూ మరో వార్త. త్రివిక్రమ్ మదిలో పౌరాణికం అన్నది వుందని, పాన్ ఇండియా సినిమా తీయాలంటే తనకు ఇదే జానర్ కరెక్ట్ అని త్రివిక్రమ్ అనుకుంటున్నారని ఎప్పడో వార్త అందించాం. అంత వరకు వాస్తవం. కానీ ఎన్టీఆర్ తో అది కూడా మహేష్ సినిమా తరువాత అన్నది పక్కా ఫేక్.

ఎందుకంటే మహేష్ సినిమా తరువాత త్రివిక్రమ్ చేయబోయేది బన్నీ తోనే. అనుకోనిది ఏదైనా జ‌రిగితే తప్ప, బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిక్స్. అలాగే కొరటాల శివ తరువాత ఎన్టీఆర్ చేసే సినిమా ప్రశాంత్ నీల్ తో అన్నది ఫిక్స్.

సినిమాలు జోరు అందుకుని, వార్తలు కావాల్సినన్ని వచ్చే వరకు మరెన్ని ఫేక్ వార్తలు చూడాల్సి వస్తుందో?