వాలంటైన్స్ డే రోజున మీరు మీ భార్యకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని షారుఖ్ ఖాన్ ని ఎవరైనా అడిగితే వెంటనే తడుముకోకుండా జవాబు చెప్పేస్తాడు. తన భార్య గౌరికి ఇచ్చిన మొదటి గిఫ్ట్ ను గుర్తు చేసుకున్నాడు. 34 ఏళ్ల కిందట జరిగిన వాలంటైన్స్ డే, షారూక్ కు తన జీవితంలో మొదటి ప్రేమికుల రోజు.
గౌరితో పరిచయమైన తర్వాత వచ్చిన తొలి వాలంటైన్స్ డే ని తనకున్నంతలో ఘనంగా జరుపుకున్నాడట షారూక్. 34 ఏళ్ల క్రితం వచ్చిన ఆ ప్రేమికుల రోజున.. తన ప్రేయసి గౌరికి షారూక్ ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడట. అదేంటో తెలుసా.. ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్. అవును.. గౌరికి, షారూక్ ఇచ్చిన తొలి బహుమతి అది.
షారుఖ్ ఖాన్ ముస్లిం, గౌరి హిందువు. వారిద్దరూ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పార్టీలో కలిశారు. అప్పటికి షారుఖ్ వయసు 18 ఏళ్లు కాగా, గౌరి వయసు కేవలం 14. 1984లో అలా వారిద్దరి మధ్య కలిగిన ఇష్టం ప్రేమగా మారింది. 1991లో షారుఖ్-గౌరి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు.
బాలీవుడ్ లో ఫలానా జంట విడిపోయింది, ఫలానా జంట మధ్య పొరపొచ్చాలు వచ్చాయి అంటూ చాలామందిపై వార్తలొచ్చాయి కానీ, షారుఖ్-గౌరికి సంబంధించి ఎప్పుడూ అలాంటివి రాలేదు. మతాంతర వివాహం అయినా కూడా వారిది అన్యోన్య దాంపత్యం.
ఇక “ఈ వాలంటైన్స్ డే కి మీరు అభిమానుల నుంచి ఎలాంటి గిఫ్ట్ కావాలనుకుంటున్నారు” అనే ప్రశ్నకు షారుఖ్ అంతే పాజిటివ్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఆల్రెడీ అభిమానులు తనకు పఠాన్ సక్సెస్ తో గొప్ప వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చారని అన్నాడు. అంతకుమించి తను ఇంకేం కోరుకోనని తెలిపాడు.