2 నెలల గ్యాప్ లో ఒకే హీరో నుంచి 2 సినిమాలు

కరోనా/లాక్ డౌన్ వల్ల డేట్స్ అన్నీ తారుమారవ్వడంతో చాలామంది హీరోలు తమ సినిమాల్ని షార్ట్ గ్యాప్ లోనే థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. సత్యదేవ్, నితిన్, నాగశౌర్య, నాని లాంటి హీరోలు మినిమం గ్యాప్స్ లోనే రెండేసి…

కరోనా/లాక్ డౌన్ వల్ల డేట్స్ అన్నీ తారుమారవ్వడంతో చాలామంది హీరోలు తమ సినిమాల్ని షార్ట్ గ్యాప్ లోనే థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. సత్యదేవ్, నితిన్, నాగశౌర్య, నాని లాంటి హీరోలు మినిమం గ్యాప్స్ లోనే రెండేసి సినిమాలతో థియేటర్లలోకి వస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రవితేజ కూడా చేరాడు. మినిమం గ్యాప్ లో తన నుంచి 2 సినిమాల్ని విడుదల చేస్తున్నాడు.

ప్రస్తుతం ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నాడు రవితేజ. వీటిలో ఖిలాడీ సినిమా దాదాపు పూర్తయింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్రినాధరావు నక్కిన సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ 3 సినిమాల్లో 2 సినిమాల్ని తక్కువ గ్యాప్ లో రిలీజ్ చేస్తున్నాడు రవితేజ.

ఖిలాడీ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 25న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అంటే 2 నెలల్లోపే రవితేజ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు రాబోతున్నాయన్నమాట.

నిజానికి ఖిలాడీ సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కరోనా/లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. దీంతో రవితేజ 2 సినిమాలు 2 నెలల గ్యాప్ లోనే థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి.

ప్రకటన అయితే వచ్చింది కానీ కచ్చితంగా రిలీజ్ అవుతుందా అవ్వదా అనే విషయాన్ని అప్పుడే చెప్పలేం. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పరిస్థితులు కుదుటపడలేదు. మూడో వేవ్ భయాలు మళ్లీ మొదలయ్యాయి. ఏమాత్రం పరిస్థితి చేజారినా, మరోసారి సినిమా రిలీజ్ డేట్స్ అన్నీ మారిపోతాయి.