Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప...తగ్గేదేలే...?

పుష్ప...తగ్గేదేలే...?

అఖండ విడుదలకు ముందు ఆంధ్రలో టికెట్ రేట్లు అన్నదే పెద్ద డిస్కషన్ పాయింట్. ఆంధ్రలో రేట్లు కిట్టుబాటు కావు అనేదే వాదన. అలాంటి టైమ్ లో అఖండ సినిమా రేట్లను 18 నుంచి 20 శాతం తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది. 

బేరసారాలు సాగిన తరువాత. అదే సమయంలో తరువాత లైన్ లో వున్న సినిమాలు అయిన పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ కూడా ఈ బేరసారాల వ్యవహారాలపై ఓ కన్నేసి వుంచాయి. 

అఖండ విడుదలయిన తరువాత సీన్ మారిపోయింది. నిర్మాతలందరికీ ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అయితే ఇప్పుడు క్వశ్చను ఒకటి మిగిలింది. పుష్ప సినిమా రేట్లు తగ్గుతాయా? లేదా? అన్నదే ఆ క్వశ్చను. ఆంధ్ర ఏరియాను 60 కోట్లకు విక్రయించారు. 

గతంలో లెక్కల్లో ప్రకారం అయితే తగ్గిస్తే దాదాపు ఆంధ్ర, సీడెడ్ కలిపి దగ్గర దగ్గర పదిహేను కోట్లు కట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ ఊపు చూసి, అలాంటి ఆలోచన ఏదీ చేయడం లేదని తెలుస్తోంది. 

ప్రస్తుతానికి ముందు వున్న రేట్లపైనే విడుదల చేయిస్తారని, తరువాత లెక్కలు చూసుకుందామనే హామీతో బయ్యర్లకు సర్ది చెబుతారని తెలుస్తోంది. వరుసగా సినిమాలు నిర్మిస్తున్న బ్యానర్ కాబట్టి, అలాగే రెండో భాగం సినిమా బకాయి వుంది కాబట్టి బయ్యర్లు పెద్దగా పట్టుబట్టే ఆలోచనలో లేరని తెలుస్తోంది

కానీ పుష్ప కన్నా పెద్ద మొత్తంలో సేల్ అయిన ఆర్ఆర్ఆర్ సంగతి పుష్ప తరువాత కానీ తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?