ఆలు లేదు చూలు లేదు అన్నట్లుగా బాలయ్య-బోయపాటి సినిమా మీద వస్తున్న గ్యాసిప్ లు పాపం,దర్శకుడు బోయపాటిని ఫీలయ్యేలా చేస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం వున్న హిందీ మార్కెట్ పరిస్థితి,బాలయ్య గత సినిమాల మార్కెట్, బోయపాటి సినిమాల మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే ఈ సినిమా ఏ మేరకు బడ్జెట్ అయితే ప్రాఫిట బుల్ అనే విషయం మీద విపరీతంగా వార్తలు వస్తున్నాయి.
బోయపాటి ఈ సినిమాకు 70 కోట్ల బడ్జెట్ అంటున్నారన్నది,బాలయ్యతో గట్టిగా యాభై కోట్లు లాగడం కష్టం అవతుందన్నది వార్తల సారాశం.కానీ బోయపాటి వినయ విధేయ రామ డిజాస్టర్ అయినా 60 కోట్లకు పైగా వసూలు చేసిందన్నది బోయపాటి ధీమాగా వినిపిస్తోంది. కానీ బాలయ్య ఏ సినిమా కూడా ఆ రేంజ్ లో లేవు అని ఆయన గుర్తించడం లేదేమో?
ఇలా వార్తలు వస్తూ వుంటే నిర్మాత ఎక్కడ వెనక్కు అడుగు వేస్తారేమో అని బోయపాటి ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.జయజానకీ నాయకతో నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి గట్టి దెబ్బ తిన్నారు. అయితే ఈ సినిమా వ్యవహారం వేరు. బాలయ్యతో 70 కోట్లకు పైగా ఖర్చు అంటే చాలా కష్టంఅవుతుంది. ఎందుకంటే బాలయ్యకు ఓవర్ సీస్ మార్కెట్ లేదు.హిందీ మార్కెట్ డౌన్ లో వుంది.తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య-బోయపాటి మీద థియేటర్ల నుంచి 40 కోట్లు రాబట్టాలన్నా కష్టమే అని ట్రేడ్ వర్గాల బోగట్టా.
ఇవన్నీ వార్తలు వస్తుంటే బోయపాటి కలవరపడుతున్నారని,ఒకరిద్దిరు మీడియా జనాలకు కూడా ఫోన్ చేసి,తన అసంతృప్తి వ్యక్తం చేసారని తెలుస్తోంది.