దిశ హంతకులు మైనర్లయినా పోలీసులు సేఫే

పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన దిశ హంతకులలో ముగ్గురు మైనర్లని ఇప్పుడు కొత్తగా ప్రచారం జరుగుతోంది. వారి బోనఫైడ్ సర్టిఫికెట్ల ప్రకారం.. ముగ్గురు మైనర్లేనని తేలుస్తున్నారు. వీటిని దిశ నిందితుల తల్లిదండ్రులు జాతీయ…

పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన దిశ హంతకులలో ముగ్గురు మైనర్లని ఇప్పుడు కొత్తగా ప్రచారం జరుగుతోంది. వారి బోనఫైడ్ సర్టిఫికెట్ల ప్రకారం.. ముగ్గురు మైనర్లేనని తేలుస్తున్నారు. వీటిని దిశ నిందితుల తల్లిదండ్రులు జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా పంపారు. మరణించిన నిందితులు మైనర్లు అయినంత మాత్రాన ఏమవుతుంది? వారిని ఎన్‌కౌంటర్లో అంతమొందించడానికి, మైనర్లు కావడానికి సంబంధం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులను తప్పు పట్టడం సాధ్యం కాదని కూడా అంటున్నారు.

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు అరెస్టయినప్పుడే.. వారందరూ 20 ఏళ్లు దాటిన వారే అని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలోనే వారి మైనారిటీకి సంబంధించిన సందేహం ప్రజలకు తొలగిపోయింది. ఎందుకంటే.. ఢిల్లీలో ఏడేళ్లకిందట జరిగిన నిర్భయ అత్యచారాం హత్య కేసు విషయంలో.. నలుగురు నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో.. శిక్ష నుంచి తప్పించుకున్నారు. దిశ కేసులో అలాంటిది జరిగే అవకాశం లేదని ప్రజలు అనుకున్నారు. అందరూ 20ఏళ్లు దాటిన వారే గనుక.. శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరని ప్రజలు అనుకనునారు. ఆ సమయంలో పోలీసులు.. అరెస్టు అయిన నిందితులు చెప్పిన వివరాలను బట్టే తాము వారి వయసు నమోదు చేశామని కూడా వివరించారు.

ఒకవేళ వారికి న్యాయపరంగా శిక్ష పడి ఉంటే.. లేదా, కోర్టు ఎదుట ఈ వ్యవహారం చర్చకు వచ్చి ఉంటే.. పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. కానీ వారు ఎన్ కౌంటర్ అయ్యారు. పోలీసుల మీద దాడికి ప్రయత్నించి… కాల్చడానికి చూసినప్పుడు.. ఎదురు కాల్పుల్లో వారు మరణించారు. ఈ విషయాన్ని మైనారిటీకి ఎలా ముడిపెడతారనేది తెలియడం లేదు.

ఎన్‌హెచ్‌ఆర్ ‌సీ విచారించినా కూడా… వారు చెప్పిన వివరాల ప్రకారమే వయసు నమోదు చేశామని, కోర్టుకు వెళ్లి ఉంటే ఆ విషయం తేలేది గానీ. ఈలోపుగానే వారు దాడికి ప్రయత్నించినప్పుడు అనుకోకుండా ఎన్‌కౌంటర్ జరగడం వల్ల వారి వయస్సు నిర్ధరించలేకపోయామని పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీ ఎదుట తమ వాదన వినిపిస్తారు. ఎన్‌హెచ్‌ఆర్ ‌సీ పోలీసుల్ని తప్పుపట్టడం అనేది.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరులోనే తప్పుపట్టాలి తప్ప.. వారు మైనర్లు అనే విషయంలో వారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చునని ప్రజల్లో చర్చ జరుగుతోంది.