ఎవ్వరూ ఊహించి వుండరేమో? సరిగ్గా వారం రోజుల క్రితం వరకు. వెంకీమామ సినిమా డేట్ అనౌన్స్ కావడం లేదు. ఫ్యాన్స్, సినిమా జనాలు రకరకాల డేట్ లు వినిపిస్తున్నారు. సినిమా బజ్ పోతోంది, లేదా రావడం లేదు అని ఫ్యాన్స్ కంప్లయింట్. ఇలాంటి టైమ్ లో 13న విడుదల అని ప్రకటించారు. సరిగ్గా వారం తిరిగేసరికి వెంకీమామ సీన్ మారిపోయింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా వెంకీమామే. ఏ మాధ్యమం చూసినా వెంకీమామే. అనుకోకుండా అలా కుదిరేయడం కాదు. వున్న వనరులను అలా వాడేయగలిగారు. ఇది కేవలం దగ్గుబాటి ఫ్యామిలీ సినిమా కాబట్టి ఇది సాధ్యమయింది. నాగ్ చైతన్య, రానా, వెంకీ, సురేష్ బాబు, ఈ నలుగురు ఒక్క ఫ్యామిలీ. దాంతో ఒకటా రెండా? ఎన్ని కాంబినేషన్లు, ఎన్ని ఇంటర్వూలు. మరోపక్క ఇద్దరు హీరోయిన్లు, డైరక్టర్. మరో అన్ని కాంబినేషన్లు.
దీంతో మొత్తం మీద వెంకీమామ ఫీవర్ స్టార్ట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ తరువాత సరైన ఎంటర్ టైనర్ రాలేదు. మజిలీ తరువాత చైతూ సినిమా. ఎఫ్ 2 తరువాత వెంకీ సినిమా. పైగా మల్టీ స్టారర్. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బోలెడు పాయింట్లు కలిసి వచ్చేసాయి.
మొత్తం మీద అప్పుడే వెంకీమామ బుకింగ్స్ జోరు స్టార్ట్ అయింది. తొలి మూడు రోజులు మాగ్జిమమ్ లాగడానికి సన్నాహాలు కనిపిస్తున్నాయి. ఇక ఆపైన అన్నది సినిమాను బట్టి వుంటుంది. మొత్తం మీద 'దగ్గుబాటి' ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ప్రచారంలోకి దిగిపోవడం కలిసివచ్చింది.