ఉల్లిపాయల రాజకీయానికి శవ రాజకీయాన్ని కూడా జోడించాలన్న తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల ప్రయత్నం విఫలం అయ్యింది.దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీ ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్సిడీ ధరలకు అందిస్తూ ఉంది.దేశమంతా కిలో ఉల్లి నూటా యాభై రూపాయల పై ధరను పలుకుతూ ఉంటే.. ఏపీలో మాత్రం ప్రభుత్వం ఆధార్ కార్డుకు రోజుకు కిలో ఉల్లి చొప్పున పాతిక రూపాయల ధరకు అందిస్తూ ఉంది.
దీని కోసమని వినియోగదారులు రైతు బజార్ లలో బారులు తీరుతూ ఉన్నారు.ప్రస్తుతం ఉల్లిపాయలకు ఉన్న డిమాండ్ రీత్యా అలాంటి క్యూలు సహజమే అనుకోవాలి.అయితే దీనిపై జనసేన,టీడీపీ రాజకీయం సాగుతూ ఉంది.ఆ పార్టీ వాళ్లు ఉల్లి పాయలను ఇలా రేషన్ గా ఇవ్వడమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.ఉల్లిపాయల క్యూలు పవన్ కల్యాణ్ కు ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తున్నాయి!
అంతేకాకుండా.. గుడివాడలో మార్కెట్ సమీపంలో ఒక వ్యక్తి మరణించడంతో పవన్, చంద్రబాబుల శవరాజకీయం మొదలైంది.అందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు పవన్ కల్యాణ్.చివరకు ఆ వ్యక్తి ఇంట్లో వాళ్లు బయటకు వచ్చారు.సాంబిరెడ్డి అనే ఆ వ్యక్తి కుటుంబం వెల్ సెటిల్డ్ అని తెలుస్తోంది.
ఆయన ఇద్దరు కొడుకులూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు అని కూడా సమాచారం.వాళ్ల బంధువు ఒక ఆయన లాయర్. తమది ఉల్లిపాయల కోసం క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉన్న ఫ్యామిలీ కాదని వారు స్పష్టం చేశారు.మృతి చెందిన సాంబిరెడ్డికి చాలా కాలంగా ఆరోగ్యం బాగోలేదని,ఆర్టీసీలో కండక్టర్ గా పని చేస్తూ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ను తీసుకున్నారని వారు చెప్పారు.
ఆయన ఉదయం గుడికి వెళ్లి రైతు బజార్ కు వెళ్లి ఉండవచ్చని,అక్కడ హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయారని కుటుంబీకులు స్పష్టం చేశారు.దుష్ట రాజకీయంలోకి తమను లాగవద్దని వారు చంద్రబాబు,పవన్ కల్యాణ్ లకు తగిలేలా చెప్పారు.ఉల్లిపాయల మీద ఏకంగా శవరాజకీయం చేయబోయిన పార్ట్ నర్స్ ఇద్దరికీ ఝలక్ తగిలినట్టుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.