విరూపాక్ష..హోల్ సేల్..సేల్

ఈ మధ్యన డిస్ట్రిబ్యూషన్ రంగం మీద మళ్లీ పెట్టుబడులు, ఆశలు..అంచనాలు పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు మంచి హిట్ లు పడడం, మళ్లీ థియేటర్లు కళకళలాడడం చూసి,…

ఈ మధ్యన డిస్ట్రిబ్యూషన్ రంగం మీద మళ్లీ పెట్టుబడులు, ఆశలు..అంచనాలు పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు మంచి హిట్ లు పడడం, మళ్లీ థియేటర్లు కళకళలాడడం చూసి, సినిమాలు కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు కాస్త పోటీ పడుతున్నారు. 

దసరా సినిమాను తెలుగు రాష్ట్రాల హక్కులు హోల్ సేల్ గా ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అమిగోస్ సినిమాను కూడా ఇలాగే అమ్మేసి నిర్మాత లాభం చేసుకున్నారు.

ఆ సంగతి అలా వుంచితే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాను కూడా ఇదే విధంగా మార్కెట్ చేసేసారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 కోట్లకు పైగానే ఈ సినిమాను వెస్ట్ గోదావరికి చెందిన ప్రవీణ్ తీసుకున్నారు. ఇటీవలే విరూపాక్ష ట్రయిలర్ వచ్చింది. థ్రిల్లర్ జానర్ కు చెందిన ఈ సినిమా మీద కాస్త అంచనాలు పెంచింది. దాంతో బేరాలు రావడం మొదలైంది. ప్రవీణ్ కాస్త అడుగు ముందుకు వేసి, ఓ రిస్కీ ఫిగర్ కోట్ చేసి మరీ సినిమాను తీసుకున్నారు.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం బారిన పడి తేరుకున్న తరువాత వస్తున్న తొలి సినిమా ఇది. పైగా హర్రర్ థ్రిల్లర్ జానర్. పైగా ఇన్ సైడ్ టాక్ బాగుంది. దాంతో ఈ రేటు పలికింది అనుకోవాల్సిందే. భోగవిల్లి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ రైటింగ్స్ టీమ్ నుంచి ఈ సినిమా వస్తోంది.