అఖండ సినిమాలో బాలకృష్ణ-ప్రగ్యా జైశ్వాల్ జోడీ అదరగొట్టింది. తొలిసారి బాలయ్య సరసన నటించిన ఈ బ్యూటీ, తన లుక్స్, డాన్స్ మూమెంట్స్ తో నందమూరి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. మరీ ముఖ్యంగా జై బాలయ్య సాంగ్ తో మెస్మరైజ్ చేసింది. ఇప్పుడీ బ్యూటీ మరోసారి బాలయ్య సరసన మెరిసింది.
అవును.. బాలయ్య-ప్రగ్యా మరోసారి కెమెరా ముందుకొచ్చారు. అయితే ఈసారి వీళ్లు కలిసి నటిస్తోంది సినిమాలో కాదు. ఓ యాడ్ కోసం ఇలా బాల-ప్రగ్యా కెమెరా ముందుకొచ్చారు. ఓ పెళ్లి సెటప్.. పెళ్లికొడుకు గెటప్ లో బాలయ్య, పెళ్లికూతురు గెటప్ లో ప్రగ్యా.. పెళ్లిపీటలపై కూర్చున్నారు.
ఆ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలా బాలయ్య-ప్రగ్యా జోడీ మరోసారి మెరిసింది. రీసెంట్ గా వచ్చిన పాపులారిటీతో కొన్ని యాడ్స్ కు కమిట్ అయ్యాడు బాలయ్య. అలా రాబోతున్న ఓ వాణిజ్య ప్రకటనలో ఇలా బాలయ్య-ప్రగ్యా కలిసి నటిస్తున్నారు. అఖండ విజయం తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయిన ప్రగ్యా, మళ్లీ ఇలా మరోసారి బాలయ్యతోనే తెరపైకి రావడం యాధృచ్ఛికం.
ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు బాలయ్య. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా అన్-స్టాపబుల్ సీజన్-2ను కూడా ముగించాడు ఈ సీనియర్ నటుడు.