కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. పైగా మొదటి రోజు కలెక్షన్లు కూడా పెద్దగా లేకపోవడంతో, ఈ మూవీ వసూళ్లపై ఆ ప్రభావం గట్టిగా పడింది.
నిన్నటితో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం నాలుగున్నర కోట్లకు కాస్త అటుఇటుగా షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వసూళ్లతో ఈ సినిమా గట్టెక్కడం కష్టమని దాదాపు తేలిపోయింది.
ఎందుకుంటే, ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 6 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రావాల్సి ఉంది. ఇప్పుడు పరిస్థితుల్లో, ఈ టాక్ తో అంత మొత్తం అంటే దాదాపు అసాధ్యం. ఇంకా చెప్పాలంటే, ఈ వారంలో ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేలా ఉంది.
అటు యూఎస్ లో కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. 3 రోజుల్లో ఈ సినిమాకు లక్షా 50వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. కల్యాణ్ రామ్ గత చిత్రం బింబిసారకు అమెరికాలో, మొదటి 3 రోజుల్లో 3 లక్షల 37 వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో యూఎస్ మార్కెట్లో అమిగోస్ కు పెద్దగా వసూళ్లు రాకపోవచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది.
బింబిసార విజయాన్ని అమిగోస్ తో కొనసాగించాలని కల్యాణ్ రామ్ చాలా ఆశపడ్డాడు. మరీ ముఖ్యంగా బింబిసార సక్సెస్ తో అమిగోస్ కు మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావించాడు. కానీ కల్యాణ్ రామ్ అనుకున్నదేదీ జరగలేదు.