వైసీపీలో ఇవాళ చేరిన మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఖాయమా? అంటే …ఔనని అంటున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు టీడీపీ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కొనసాగేవారు. తాజాగా ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో ఆయన చేరికతో ఏలూరు జిల్లాలో అధికార పార్టీ మరింత బలపడుతుందని చెబుతున్నారు.
జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరడమే ఆలస్యం, ఆయనకు నలుగురు గన్మెన్లను కూడా కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనకు వైసీపీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకటరమణకు ఇవ్వొచ్చని సమాచారం. ఆ ఒప్పందంతోనే టీడీపీని కాదని ఆయన వైసీపీ కండువా కప్పుకున్నట్టు సమాచారం.
బీసీలను వైసీపీ వైపు తిప్పుకునేందుకు ప్రతి అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకోదలిచారు. అందుకే ఆయన పదవులకు సంబంధించి అధిక ప్రాధాన్యం బీసీలకు ఇస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఇవాళ చేరినప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా కేవలం కులం కోణం, ఆ సామాజిక వర్గంలో సదరు నాయకుడి పలుకుబడిని చూస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక నాయకుడికి పదవి ఇస్తున్నారంటే… ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారనే సంగతి తెలిసిందే.