ష‌ణ్ముఖ్‌కు ప్రియ నెచ్చ‌లి షాక్‌!

బిగ్‌బాస్ తాజా కంటెస్టెంట్‌, యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్‌కు ప్రియ నెచ్చ‌లి, ఒక‌ప్ప‌టి బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన దీప్తి సున‌యిన షాక్ ఇచ్చారు. షణ్ముఖ్‌, దీప్తి మ‌ధ్య ప్రేమ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.  Advertisement…

బిగ్‌బాస్ తాజా కంటెస్టెంట్‌, యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్‌కు ప్రియ నెచ్చ‌లి, ఒక‌ప్ప‌టి బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన దీప్తి సున‌యిన షాక్ ఇచ్చారు. షణ్ముఖ్‌, దీప్తి మ‌ధ్య ప్రేమ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 

తాను బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిస్తే… తాను గెలుచుకునే మొత్తంలో సగం సొమ్మును దీప్తికి ఇస్తాన‌ని ష‌ణ్ముక్ ప్ర‌క‌టించేంత అన్యోన్య బంధం వాళ్ల మ‌ధ్య ఉంది.

బిగ్‌బాస్ సీజ‌న్‌-5 ముగింపున‌కు చేరువ‌లో ఉంది. దీంతో ఈ సీజ‌న్ విజేత‌గా నిల‌వాలంటే ప్ర‌తి ఓటూ కీల‌క‌మే. మ‌రీ ముఖ్యంగా స‌న్నీ, ష‌ణ్ముఖ్ మ‌ధ్య నువ్వానేనా అన్న‌ట్టు పోటీ న‌డుస్తోంది. వీళ్లిద్ద‌రిలో ఎవ‌రూ ఒక‌రు మాత్ర‌మే విజేత‌గా నిలుస్తార‌ని సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. 

దీంతో స‌న్నీ, ష‌ణ్ముఖ్ స్నేహితులు శ‌క్తివంచ‌న లేకుండా త‌మ దోస్తుల‌ను విజేత‌గా చూసేందుకు శ్ర‌మిస్తున్నారు. త‌మ స్నేహితుల‌కు ఓట్లు వేయాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభ్య‌ర్థిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ష‌ణ్ముఖ్‌కు ప్రియ నేస్తం దీప్తి గ‌ట్టి షాక్ ఇవ్వ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇంత వ‌ర‌కూ షణ్ముఖ్‌ను గెలిపించాల‌ని కోరుతూ వ‌చ్చిన దీప్తి సున‌య‌న‌… తాజాగా త‌మిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ గెలుపు కోసం విస్తృత ప్ర‌చారం చేయ‌డం విశేషం. 

ప్ర‌స్తుతం త‌మిళంలో కూడా బిగ్‌బాస్ సీజ‌న్‌-5 కొన‌సాగుతోంది. త‌మిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వరుణ్‌కు దీప్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని సోష‌ల్ మీడియాలో ఆమె షేర్ చేయ‌డం విశేషం.

ష‌ణ్ముఖ్‌ను విడిచిపెట్టి, వ‌రుణ్ గెలుపు కోసం దీప్తి ప్ర‌చారం చేయ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఏంటిది దీప్తి అంటూ…ష‌ణ్ముఖ్ ఊత ప‌దాల్ని తెరపైకి తెస్తూ ఆమెని ఆట ప‌ట్టిస్తున్నారు.