తెలుగుదేశం పార్టీకి విశాఖ సిటీలో నలుగురు ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గుడ్ బై కొట్టాక లెక్క ప్రకారం ముగ్గురు మిగలాలి. కానీ టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న సమావేశాలకు ఒకే ఒక్కడుగా ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు మాత్రమే హాజరవుతున్నారు.
విశాఖలో ఉన్న మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు మాత్రం ఏ కారణం చేతనో కనిపించడంలేదు. మరి విశాఖలో టీడీపీ బలం చెక్కు చెదరలేదని అధినాయకత్వం చెప్పుకుంటోంది. కానీ జగన్ వేవ్ లో సైతం గెలిచిన ఎమ్మెల్యేలు అతి బలవంతులు అని అందరికీ తెలుసు. పైగా వారి వెంట కీలకమైన క్యాడర్ అంతా నడుస్తోంది.
కానీ విశాఖ నాలుగు దిక్కులా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలలో తూర్పు ఎమ్మెల్యే తప్ప ఇపుడు ఎవరూ పార్టీలో కనిపించకపోవడం ఆశ్చర్యమే. దీంతో విశాఖలో టీడీపీ పరిస్థితి తూర్పు తిరిగి దండంపెట్టు అన్నట్లుగా తయారైందని సెటైర్లు పడుతున్నాయి.