Advertisement

Advertisement


Home > Politics - Gossip

షా ఆఫీసులో 'జ్యోతి' మూడోకన్ను?

షా ఆఫీసులో 'జ్యోతి' మూడోకన్ను?

ఇద్దరు మనుషుల మధ్య జరిగిన చర్చ బయటకు వచ్చిదంటే  ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు మరెవరో ఒకరికి చెప్పి వుండాలి. లేదా ఆ ఇద్దరు చర్చించిన గదిలో మరెవరో సిసి కెమేరా పెట్టి చూసి వుండాలి.

ఆంధ్ర సిఎమ్ జగన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. జగన్ కు నమ్మకస్తులైన ఇద్దరు ఎంపీలు తోడుగా వున్నారు. ఇప్పుడు వీళ్ల సమావేశం మీద ఆంధ్రజ్యోతి అల్లిన గ్యాసిప్ ఇలా వుంది.

''....న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌కు కేంద్రమంత్రి అమిత్‌ షా క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై అమిత్‌షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వ తీరు సరిగా లేదని అమిత్‌ షా అన్నట్లు తెలుస్తోంది. అమిత్‌ షాతో జగన్‌ భేటీ  అసంపూర్తిగా ముగిసింది.  బుధవారం ఉదయం మరోసారి కలవాలని జగన్‌కు అమిత్‌ షా చెప్పి పంపినట్లు సమాచారం. దీంతో బుధవారం ఉదయం 10.30కు అమిత్‌షాను జగన్‌ మరోసారి కలవనున్నారు...''

నిజానికి ఈ వార్తకు కొన్ని గంటల ముందు మరో వార్త అందించారు. అందులో జస్ట్ జగన్ కలిసారని పలు విషయాలు విన్నవించారని మాత్రమే వుంది. కానీ అంతలోనే ఈ గ్యాసిప్ వండి వార్చారు.

ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏమిటంటే అమిత్ షా ఏమీ వైకాపా అధిష్టానం కాదు. వైఎస్ కు సోనియా క్లాస్ అంటే అర్థం వుంటుంది. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ బాస్. ఏపి ప్రభుత్వ తీరు సరిగ్గాలేదని అమిత్ షా అన్నారని జ్యోతికి ఎలా తెలిసినట్లు? ఆ గదిలో సిసి కెమేరా పెట్టి చూసారా? లేక అమిత్ షా నే, తాను క్లాస్ తీసుకున్నా అని ఎవరికన్నా చెప్పారా? కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇలాంటి గ్యాసిప్ లు వండి వార్చడం మినహా మరేం వుంటుంది.

ఎవరో ఒకరు ఖండిస్తారు. ఖండిస్తే ఖండించండి. ఈ లోగా ఈ తప్పుడు గ్యాసిప్ జనంలోకి వెళ్లిపోతుంది. అదే ప్లాన్ , అదే ధీమా, అదే పన్నాగం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?