నమ్రత పేరు..మీడియా సైలన్స్

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో మహేష్ బాబు భార్య నమ్రత పేరు వినిపించడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు తెలుగుకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ పేరు మాత్రమే వినిపించింది. మొదట్లో…

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో మహేష్ బాబు భార్య నమ్రత పేరు వినిపించడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు తెలుగుకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ పేరు మాత్రమే వినిపించింది. మొదట్లో తనకు సంబంధం లేదని, తన పేరు అనవసరంగా పాడు చేస్తున్నారని ఆమె కోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఇంతలోనే రకుల్ కు సమన్లు వచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నమ్రత పేరు బయటకు వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీ మేనేజర్ జయసాహ ను విచారించినపుడు నమ్రత పేరు వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అధికారిక సమాచారం కాదు కానీ ఇన్ సైడ్ సోర్స్ అన్నట్లుగా వచ్చాయి. సాహ వాట్సప్ చాట్స్ లో నమ్రత పేరు కోడ్ లాంగ్వేజ్ లో ఎన్ అని వున్నట్లు పేర్కొన్నాయి.

Namtratha was code-named in Jaya Saha’s Whatsapp chats as N, has messaged to J (Saha) saying that “You promised me to get some nice MD in Mumbai and we will party together, when i come next I truly need a break”As these reports claim, J replies, “How you are making me into a peddler, however, your wishes my command”.

అని కొన్ని ఇంగ్లీష్ పోర్టల్స్ లో వార్తలు కనిపించాయి.  చిన్న సెన్సేషన్  వార్త వస్తే చాలు బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా హడావుడి చేసి, ట్విట్టర్ లో రెచ్చిపోయే తెలుగు సినిమా బేస్డ్  పోర్టల్స్ దాదాపుగా ఈ విషయంలో మౌనం వహించాయి. ఒక్క జ్యోతి, సాక్షి మాత్రమే ఈ వార్తను అందించాయి.  టీవీ 9 కాస్త గట్టిగానే ఈ వార్తను అందించింది. 

ట్విట్టర్ లో సదా యాక్టివ్ గా వుండే మహేష్ కానీ ఇన్ స్టాలో యాక్టివ్ గా వుండే నమ్రత కానీ ఈ విషయంలో స్పందించలేదు. పైగా నిన్ననో, ఈరోజునో నమ్రత ముంబాయిలోనే వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తలు నిజం కాదని నమ్రత టీమ్ ఖండించింది.  ఇదిలా వుంటే. ఒక్క బండ్ల గణేష్ మాత్రమే నమ్రత గురించి ఓ పాజిటివ్ ట్వీట్ వేసారు. 

అసలు విషయం ఏమిటో తెలిసి, క్లారిటీ వచ్చిన తరువాత బహశా టాలీవుడ్ మీడియా కానీ, టాలీవుడ్ జనాలు కానీ స్పందించే అవకాశం వుందనుకోవాలి. 

చీఫ్ జస్టిస్ అయితే కొత్త న్యాయం ఉందా?