డైరక్టర్ రమేష్ వర్మ-నిర్మాత కోనేరు సత్యనారాయణల అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి వుంది. హీరో రవితేజతో. క్రాక్ సినిమా తరువాత రవితేజ చేయబోయే సినిమా అయితే అదే. ఈ సినిమా మీద ఎప్పటి నుంచో ఒక వార్త వినిపిస్తోంది. తమిళంలో ఇంకా విడుదల కాని చతురంగవేట్టయ్ 2 కు ఇది రీమేక్ అని. అయితే మేకర్స్ మాత్రం కాదని చెబుతూ వస్తున్నారు.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం వేరుగా వుంది. ఈ సినిమా పాయింట్ చతురంగవేట్టయ్ 2 నే అని. అయితే కేవలం లైన్ తీసుకుని, స్వంతగా కథ తయారుచేసుకున్నారని తెలుస్తోంది. అందువల్ల రీమేక్ అన్న విషయాన్ని ఎక్కడా వెల్లడించడం లేదు. సమస్యలు రాకుండా రైట్స్ మాత్రం తీసి పక్కన పెట్టుకున్నారని బోగట్టా.
చతరంగవేట్టయ్ 2 సినిమా లైన్ నే మొత్తం మార్చారని, బాగుందని, హీరో రవితేజ నే తనను కలిసిన సినిమా జనాలు కొందరితో చెప్పినట్లు తెలుస్తోంది. క్రాక్ పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత చేయాల్సిన సినిమాను మాత్రం రవితేజ ఇంకా ఫిక్స్ చేయలేదు.