కరాటే కల్యాణి …క్యాస్టింగ్ కౌచ్‌పై దుమారం చేలరేగిన సందర్భంలో అందరికీ బాగా తెలిసిన పేరు. అప్పట్లో శ్రీరెడ్డితో ఢీ అంటే ఢీ అన్నట్టు టీవీ డిబేట్లలో గొడవ పడిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా శ్రీరెడ్డి, కరాటే కల్యాణి మధ్య పంచాయితీ పోలీస్స్టేషన్ల వరకు వెళ్లింది. ప్రస్తుతానికి వస్తే మోస్ట్ పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-4లో ఎంట్రీ ఇచ్చి …రెండో వారమే బయటకు వచ్చిన కంటెస్టెంట్‌గా కరాటే కల్యాణి మిగిలారు.
అసలు తాను ఇంత త్వరగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రావడానికి కారణాలేంటో ఆమె బయట పెట్టారు. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుస్తూ కనిపించడాన్ని జనాలకు నచ్చలేదన్నారు. ఏడ్వడమనేది తనలో బేలతనమని ప్రేక్షకులు ఓ అభిప్రాయానికి వచ్చారన్నారు.
అయితే తాను ఏ పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదని కరాటే కల్యాణి చెప్పుకొచ్చారు. హౌస్‌లో అందరికీ తాను అన్నీ చేసి పెట్టానన్నారు. తనకంటే అందరూ 15 ఏళ్ల చిన్నవాళ్లని, వాళ్ల ఆలోచనా విధానం, తన ఆలోచనా విధానం వేరని అన్నారు.
హౌస్‌లో ఉన్నంతలో చేసి పెడుతుంటే, తనను జీరో చేశారన్నారు. అలాంటప్పుడు ఆ హౌస్‌లో ఉండడం అవసరమా అనిపించి, తనకు తానుగా సెల్ఫ్ నామినేషన్ చేసుకుని బయటకు వచ్చినట్టు కరాటే కల్యాణి అసలు విషయాన్ని వెల్లడించారు.