బిగ్‌బాస్ రియాల్టీ షోను రక్తి కట్టించేందుకు స్టార్‌మా యాజమాన్యం ఎన్నెన్నో ఉపాయాలు ఆలోచిస్తోంది. ఇప్పుడిప్పుడే షోలో గ్రూపులు, గొడవలు, వాదప్రతివాదనలు సీరియస్‌గానే స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుత హౌస్ పరిస్థితి చూస్తే గొడవలు ముదిరేలా ఉన్నాయి. దీంతో ఈ రోజు షోలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలిగేలా ఓ పథకం ప్రకారం స్టార్ మా యాజమాన్యం క్రియేట్ చేయడంలో సఫలమవుతున్నట్టే కనిపిస్తోంది.
ప్రస్తుతానికి వస్తే హౌస్‌లోకి మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపుతున్నట్టు తెలుస్తోంది. జంప్ జిలానీ సినిమా హీరోయిన్ స్వాతి దీక్షితే ముచ్చటగా మూడో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నట్టు విస్తృత ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ అండ్ సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద కుమార్‌సాయి, అవినాష్ హౌస్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. వీరిలో అవినాష్ స్టార్‌మా యాజమాన్య నమ్మకాన్ని నిలబెట్టడాని చెప్పొచ్చు. ఇక కుమార్‌సాయి విషయానికి వస్తే ప్రేక్షకులు, స్టార్‌మా యాజమాన్యాన్ని తీవ్ర నిరాశ పరుస్తున్నారనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో స్వాతి దీక్షితే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళితే ఎలా ఉంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు ఐపీఎల్ స్టార్ట్ కావడం కూడా ఈ రియాల్టీ షో పే…ద్ద పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ రియాల్టీ షో వైపు ప్రేక్షకుల్ని తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హీరోయిన్‌ను ప్రవేశ పెట్టాలనే ఎత్తుగడ ఎంత వరకు సత్ఫలితాన్ని ఇస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.