బంగార్రాజు చేయాలా? అది సంక్రాంతి టార్గెట్ గా చేయాలి కాబట్టి, ఈ లోగా మరో సినిమా చేయాలా? అన్న మీమాంస తేలిపోయింది. హీరో నాగార్జున కొత్త దర్శకుడు సోలమన్ డైరక్షన్ లో సిన్మాను రెండు రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఒకటి రెండు రోజులు లాంఛనంగా షూట్ చేసి ఆపేస్తారు. ఆ తరువాత గ్యాప్ ఇచ్చి మళ్లీ స్టార్ట్ చేస్తారు.
జూన్ నుంచి బంగార్రాజు సినిమా మొదలు పెట్టే అవకాశం వుంది. బంగార్రాజుకు అడ్డంకి ఒక్కటే చైతన్య డేట్ లు కావాలి. చైతన్య ప్రస్తుం మార్చి వరకు శేఖర్ కమ్ముల సినిమా మీద వున్నారు. ఆది పూర్తయిన తరువాత ఇటు రావాలి. ఈ లోగా పరుశురామ్ సినిమా అన్న టాక్ వుంది. పరుశురామ్ సినిమా వుంటే కనుక, అది కూడా జూన్ లోగా ఫినిష్ చేయాలి.
అప్పుడు మల్టీ స్టారర్ చేయడానికి చైతన్యకు వీలవుతుంది.అందుకే బంగార్రాజను జూన్ కు షెడ్యూలు చేసినట్లు బోగట్టా. ఆరునెలల్లో ఫినిష్ చేసి 2021 సంక్రాంతికి వదలాలని ఐడియా. ఈ మేరకు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ -నాగార్జున మధ్య ఒకటి రెండు మీటింగ్ లు జరిగినట్లు బోగట్టా.
మన్మధుడు 2 తరువాత నాగ్ కాస్త డీలా అయ్యారు. దాని నుంచి మళ్లీ తేరుకుని సోలమన్ అనే కొత్త డైరక్టర్ తో సినిమా మొదలుపెట్టడం ఫ్యాన్స్ కు హ్యాపీనే.