రూలర్ బాలయ్య వచ్చేసాడు

బాలయ్య సినిమా అంటే భారీ కథ వుండాలి. ఇది ఒకప్పటి రూలు. సమరసింహారెడ్డి కాలంలో బాలయ్య కోసం భారీ కథలు అల్లేవారు. పైగా బోలెడు స్టార్ కాస్ట్, రకరకాల గెటప్ లు ఇలా ఒకటి…

బాలయ్య సినిమా అంటే భారీ కథ వుండాలి. ఇది ఒకప్పటి రూలు. సమరసింహారెడ్డి కాలంలో బాలయ్య కోసం భారీ కథలు అల్లేవారు. పైగా బోలెడు స్టార్ కాస్ట్, రకరకాల గెటప్ లు ఇలా ఒకటి కాదు హడావుడి.  లేటెస్ట్ గా విడుదలయిన రూలర్ ట్రయిలర్ చూస్తే ఈ విషయాలే గుర్తుకువస్తాయి.

కేఎస్ రవికుమార్ ఈసారి బాలయ్య కోసం అలాంటి భారీ కథనే అల్లినట్లుంది.  బీహార్ బ్యాక్ డ్రాప్ లో వ్వవహారాలు. రైతుల సమస్యలు, వారిపై రుబాబు, ఇలా ఎన్ని వున్నాయో ట్రయిలర్ లో. సుహాసిని, జయసుధ, ప్రకాష్ రాజ్, ఇలా ఎందరు నటీనటులో. 

అంతా బాగానే వుంది, భారీ సినిమాకు కావాల్సిన ఎమోషన్లు, ముడిసరుకులు అన్నీ బాగానే దట్టించారు. అయితే ఇది  సమరసింహా రెడ్డి కాలం కాదు. ఇలాంటి ఊచకోత సినిమాలను జనం చూడ్డం తగ్గించారు. రెండో పాయింట్ ఏమిటంటే, వయసు మీద పడిన బాలయ్యకు విగ్ లు సరిగ్గా సూట్ కావడం లేదు. ట్రయిలర్ లో రెండో గెటప్ విగ చూస్తుంటే యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ గట్టిగా వుండేలా వుంది. 

పైగా ట్రయిలర్ అంటే రెండు నిమషాలు. సిజి వర్క్ చేయడం వేరు. సినిమా మొత్తం బాలయ్యను అందంగా చూపించడానికి సిజి వర్క్ చేయడం వేరు. ఇక్కడ దొరికిపోతే మాత్రం చాలా కష్టం. 20న విడుదలవుతున్న రూలర్ సినిమాకు సి కళ్యాణ్ నిర్మాత.