త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు చాలా నెలలకు ముందే జెమిని టీవీకి విక్రయించేసారు. సుమారు 30 కోట్ల మొత్తానికి రెండు హక్కులు కలిపి ఇచ్చేసారు.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వున్నట్లుండి అల వైకుంఠపురములో సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు తీసుకుంది అంటూ వార్తలు పుట్టాయి. ఇదే కాస్త అనుమానంగా వుంది. ఎందుకంటే నిర్మాతలు అమ్మేసింది సన్ టీవీకి. వాళ్లకు కూడా డిజిటల్ ప్లాట్ ఫారమ్ వుంది. అది అంత పాపులర్ కాదు కానీ, అలా నడుస్తోంది.
మరి ఇలాంటి టైమ్ లో నెట్ ఫ్లిక్స్ పేరు ఎలా సీన్లోకి వచ్చిందన్నది తెలియదు. ఒకవేళ అంత పెద్ద మొత్తం పెట్టి కొన్నందున, తమ స్వంత డిజిటల్ ఫ్లారమ్ మీద విడుదల చేస్తే వర్కవుట్ కాదని సన్ టీవీ అనుకుని, మారు బేరానికి నెట్ ఫ్లిక్స్ కు అమ్మేసిందా? అన్నది అనుమానం. అసలు నిజంగా నెట్ ఫ్లిక్స్ కొన్నదా? కేవలం గాలి వార్తేనా అన్నది కూడా తెలియాల్సి వుంది.