200 మందితో కలిసి డాన్స్ చేసిన చిరంజీవి

చిరంజీవి అంటే డాన్స్.. డాన్స్ అంటే చిరంజీవి.. ఈ విషయం అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి స్టెప్స్ చూశాం. త్వరలోనే భోళాశంకర్ సినిమా నుంచి మరిన్ని 'చిరు' మూమెంట్స్ చూడబోతున్నాం. Advertisement…

చిరంజీవి అంటే డాన్స్.. డాన్స్ అంటే చిరంజీవి.. ఈ విషయం అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి స్టెప్స్ చూశాం. త్వరలోనే భోళాశంకర్ సినిమా నుంచి మరిన్ని 'చిరు' మూమెంట్స్ చూడబోతున్నాం.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఓ భారీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ సెట్ లోనే చిరంజీవిపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. 200 మంది డాన్సర్లతో భారీ ఎత్తున ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.

ఈ సాంగ్ లో మరో స్పెషాలిటీ ఏంటంటే.. చిరంజీవితో పాటు కీర్తిసురేష్ కూడా డాన్స్ చేస్తోంది. సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తిసురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.