ఆచార్యలో ఆ పాట కోసం ఇండస్ట్రీ కదిలొచ్చింది

ఆచార్య సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్లు వచ్చాయి, 2 పాటలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఒకెత్తు, ఒక్క పాట మరో ఎత్తు అంటున్నాడు దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి…

ఆచార్య సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్లు వచ్చాయి, 2 పాటలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఒకెత్తు, ఒక్క పాట మరో ఎత్తు అంటున్నాడు దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఓ సాంగ్ చేశారని.. ఆ పాట షూటింగ్ చూసేందుకు ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చిందన్నారు.

“ఆచార్యలో చిరంజీవి, చరణ్ కలిసి చేసిన పాట ఉంది. 5 రాత్రిళ్లు ఆ సాంగ్ షూట్ చేశాం. ఇద్దరూ కలిసి చేస్తున్న పాట చూడాలని, ఇండస్ట్రీలో చాలామంది డ్యూటీలు వేసుకొని వచ్చారు. చిరంజీవి కుటుంబం అంతా ఒక రోజు, చరణ్ ఫ్రెండ్స్ ఒక రోజు, దర్శకులు-ప్రొడ్యూసర్లు.. ఇలా ఆ 5 రాత్రిళ్లు జాతర అయిపోయింది.”

ఆచార్య సినిమాలో ఆ సాంగ్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు కొరటాల. శేఖర్ మాస్టర్ ఆ పాటకు కొరియోగ్రాఫర్. ఇక ఆచార్య ట్రయిలర్ పై కూడా లీకులిచ్చారు ఈ దర్శకుడు.

“థియేట్రికల్ ట్రయిలర్ గ్రాండ్ గా ఉండబోతోంది. ఎందుకంటే, ఆచార్యను చూపించాను, సిద్ధను చూపించాను. ఇప్పుడు ఇద్దర్నీ కలిపి ట్రయిలర్ లో చూపించబోతున్నాను. చాలా వర్క్ చేయాల్సి ఉంది. త్వరలోనే ట్రయిలర్ వస్తుంది.”

కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కింది ఆచార్య సినిమా. పూజా హెగ్డే, కాజల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.