జగన్ అంటే గ్రేట్… తెలుగు తమ్ముడే సాక్ష్యం

జగన్ పాలనలో ఏమీ మేలు జరగలేదని చినబాబు పాదాలు బొబ్బలెక్కెలా నడుస్తూ విమర్శలు చేస్తున్నారు. జగన్ ఏమి చేశారు అని చినబాబు పెదబాబు యుగళం పాడినా యువగళం పేరిట ఎంతగా రచ్చ చేసినా జగన్…

జగన్ పాలనలో ఏమీ మేలు జరగలేదని చినబాబు పాదాలు బొబ్బలెక్కెలా నడుస్తూ విమర్శలు చేస్తున్నారు. జగన్ ఏమి చేశారు అని చినబాబు పెదబాబు యుగళం పాడినా యువగళం పేరిట ఎంతగా రచ్చ చేసినా జగన్ చేసిన మేలు ఏంటో నేరుగా జనాలకే తెలుసు అని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇపుడు ఆ పనిని ఒక తెలుగు తమ్ముడే చెప్పడం విశేషం విడ్డూరం కాక మరేమిటి అని అంటున్నారు.

విజయనగరం జిల్లా వంగర మండలం, సంగాం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు మాజీ సర్పంచు అయిన బొండ్రోతు శ్రీనివాసరావు కుమార్తె శైలజకు జగన్న విదేశీ విద్యా దీవెన పధకం అందడం రాజకీయ సంచలనంగానే చూడాలి. గతంలో జన్మభూమి కమిటీల పేరిట తమ వారికే పధకాలు పంచిపెట్టిన ప్రభుత్వ నిర్వాకం ఉంది. ఇపుడు చూస్తే తెలుగుదేశం నాయకుడి కుమార్తె అయినా పధకాన్ని అమలు చేయడమే కాదు చెక్కు నేరుగా తెచ్చి ఆ విద్యార్ధిని అందించడాన్ని చూసిన  వారు ఇది కదా రాజకీయాలకు అతీతంగా చేసే పాలన అని అంటున్నారు.

శైలజకు ఈ పధకం ద్వారా తొలి విడతగా 13 లక్షల 99 వేల 154 రూపాయల చెక్కుని స్వయంగా విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అందించారు. రెండేళ్ల వ్యవధికి గానూ  శైలజకు విదేశీ విద్యకు అయ్యే ఖర్చు దాదాపుగా 84 లక్షల రూపాయలను జగన్ ప్రభుత్వం అందిస్తుంది.  తమ కుమార్తెకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చి ఆదుకోవడం పట్ల తెలుగుదేశం నాయకుడు బొండ్రోతు శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు. 

జగన్ చెప్పిన మాట ప్రకారం పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నారని, కేవలం అర్హత ప్రమాణంగా తీసుకుని తన కుమార్తెకు పధకం వర్తింపచేయడం గొప్ప విషయం అన్నారు. తెలుగు తమ్ముడు ఇలా జగన్ పాలన గురించి మెచ్చగా ఎన్ని గళాలు వచ్చి గోల చేసినా జనాలు నమ్ముతారా. రాజకీయాలు అంటే ఇలాగే చేయాలని గతంలో పాలకులు అవలంబించిన విధానం చూశారు. రాజకీయాలకు అతీతంగా అందరి మేలు చూసే వర్తమాన పాలన చూస్తున్నారు. నిర్ణయం తీసుకొవాల్సింది తీర్పు చెప్పాల్సింది ఇక ప్రజలే అని అంటున్నారు వైసీపీ నేతలు.