ఆ టైమ్ లో అందరి దృష్టి నా తొడలపైనే..!

బాడీ షేమింగ్ అనేది ఆడవాళ్లు ఎక్కువగా ఎదుర్కొనే అవమానం. అందులోనూ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి అది మరీ ఎక్కువ. ఇప్పుడంటే హీరోయిన్లంతా నాజూగ్గా తయారయ్యారు కానీ అప్పట్లో హీరోయిన్లలో చాలామంది బొద్దుగుమ్మలు ఉండేవారు. అలాంటి…

బాడీ షేమింగ్ అనేది ఆడవాళ్లు ఎక్కువగా ఎదుర్కొనే అవమానం. అందులోనూ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి అది మరీ ఎక్కువ. ఇప్పుడంటే హీరోయిన్లంతా నాజూగ్గా తయారయ్యారు కానీ అప్పట్లో హీరోయిన్లలో చాలామంది బొద్దుగుమ్మలు ఉండేవారు. అలాంటి వారు తెరపై కనపడితే ప్రేక్షకులు ఈలలు వేస్తారు కానీ, నిజంగా ఎదురొస్తే మాత్రం కొంటెగా మాట్లాడకుండా ఉండలేరు. సినిమా షూటింగ్ స్పాట్ లో కూడా అలాంటి కామెంట్లు వారు ఎదుర్కొంటారు.

సరిగ్గా అలాంటి పరిస్థితే తనకు చాలాసార్లు ఎదురైందని అంటున్నారు అలనాటి అందాల తార, మాజీ హీరోయిన్ రవీనాటాండన్. ప్రధానంగా తన తొడల గురించే అందరూ చర్చించుకునేవారని, థండర్ థైస్ అనే నిక్ నేమ్ తో పిలిచేవారని చెబుతున్నారు రవీనా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయటపెట్టారు.

పదహారున్నరేళ్లకే..

పదహారున్నరేళ్లకే తాను సినీరంగంలోకి వచ్చానని, ఆ టైమ్ లో టీనేజ్ లో ఉన్న తను కాస్త ఎక్కువ బరువుతో ఉండేదాన్నని చెప్పారు రవీనా. అలా బరువు ఎక్కువగా ఉండటం వల్ల తన కాళ్లు, తొడలు లావుగా ఉండేవని అయితే సినిమాల్లో అవకాశాలకు అది తనకు అడ్వాంటేజ్ గా మారిందని చెప్పారామె.

కానీ రియల్ లైఫ్ లో మాత్రం తాను బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. చాలామంది తనను థై క్వీన్ (తొడల రాణి) అని పిలిచేవారని అన్నారు. బరువు తగ్గేందుకు తానేమీ ప్రత్యేక ప్రయత్నాలు చేయలేదన్నారు. అప్పట్లో రవీనాటాండన్ సెక్సీ హీరోయిన్ గా సినిమాల్లో రాణించారు. షార్ట్ డ్రస్సుల్లో కేక పుట్టించారు. డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇప్పటికీ ఆమె పాటలు, డ్యాన్స్ లు సినీ ప్రియుల్ని అలరిస్తుంటాయి.

ప్రస్తుతం రవీనా వయసు 48ఏళ్లు. గతంలో ఎప్పుడూ ఆమె బాడీ షేమింగ్ గురించి మాట్లాడలేదు. కనీసం తాను ఫేమ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. కానీ ఇప్పుడామె దాన్ని బయటపెట్టారు. అయితే అలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ ను తను సరదాగానే తీసుకుంటున్నానన్నారు.

వాస్తవానికి అప్పట్లో సినిమా మేగజీన్స్.. హీరోయిన్లను చాలా ఇబ్బంది పెట్టేవని అన్నారు రవీనా. మేగజీన్స్ లో వచ్చే గాసిప్స్ తోనే తాము ఎక్కువగా బాధపడేవాళ్లం అని చెప్పారు. థండర్ థైస్ అనే నిక్ నేమ్ ని కూడా ఇన్నాళ్లకు బయటపెట్టారు రవీనాటాండన్.