బిగ్‌బాస్ హౌజ్‌లో బిగ్ ట్విస్ట్. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న యాంకర్ రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. యాంకర్ రవి ఎలిమినేషన్ వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆరోపిస్తూ అభిమానులు రోడ్డెక్కారు.
ఎలిమినేషన్ ప్రక్రియలో చివరగా మిగిలిన ఇద్దరిలో కాజల్, యాంకర్ రవి ఉన్నారు. దీంతో తాను ఇంటిదారి పట్టడం ఖాయమనే నిర్ణయానికి వచ్చిన కాజల్ తన స్నేహితులైన సన్నీ, మానస్ వద్ద భావోద్వేగానికి గురి కావడం అందరూ చూశారు.
అయితే ఈ వారం రవిని బయటకు పంపడం ఖాయమని సోషల్ మీడియా ముందే కోడై కూసింది. ఈ నేపథ్యంలో రవిని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని ఆగ్రహిస్తూ… అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ వద్ద అభిమానులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు.
రవి అభిమానులు భారీగా ఆందోళనకు దిగడంతో ఆ పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నిరసనలో తెలంగాణ జాగృతి సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. ఇదిలా వుండగా ఎలిమినేట్ అయిన రవి… స్టేజ్‌పై నాగార్జునతో మాట్లాడుతూ అంతిమంగా తెలుగు ప్రేక్షకులు, ప్రజలు సముచిత నిర్ణయాన్ని ప్రకటిస్తారని అభిప్రాయపడ్డారు.
రవికి మిగిలిన వాళ్లతో పోల్చితే తక్కువ ఓట్లు వచ్చాయని హోస్ట్ నాగార్జున కూడా ప్రకటించారు. బహుశా తన అభిమానులకు కూడా తక్కువ ఓట్లు రావడంతోనే ఎలిమినేట్ అయినట్టు రవి సర్ది చెప్పి వుంటాడు. ఏది ఏమైనా రవి ఎలిమినేట్ కావడంతో ఈ ఐదో బిగ్‌బాస్ సీజన్లో పెద్ద షాక్ అని చెప్పొచ్చు.