ప‌డ‌క్కుర్చీ క‌బుర్లు చెబుతున్న చంద్ర‌బాబు!

తిరుప‌తి ఎంపీ చ‌నిపోయి.. రెండు రోజులైనా కాలేదు, దారుణం ఏమిటంటే.. ఆ చావును కూడా చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయం కోసం వాడుకుంటున్నారు. త‌న పార్టీ ఎంపీ చ‌నిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా…

తిరుప‌తి ఎంపీ చ‌నిపోయి.. రెండు రోజులైనా కాలేదు, దారుణం ఏమిటంటే.. ఆ చావును కూడా చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయం కోసం వాడుకుంటున్నారు. త‌న పార్టీ ఎంపీ చ‌నిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ ఎంపీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌లేద‌ట‌. ఇది జ‌గ‌న్ లోని క‌ర్క‌శ‌త్వం అంట‌! చంద్ర‌బాబుకు మ‌తి చ‌లించింది.. అని ప్ర‌త్య‌ర్థులు అంటుంటే, న‌మ్మ‌లేని వాళ్లు ఇలాంటి మాట‌లు వింటూ న‌మ్మాల్సి వ‌స్తుందేమో!

త‌నేమో ఇళ్లు దాట‌డు. ఇంట్లో కూర్చుని జూమ్ మీటింగులు పెడ‌తారు, ట్వీట్లేస్తారు. అదే రాజ‌కీయం అని చంద్ర‌బాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. అయితే ఒక ఎంపీ చ‌నిపోతే.. ఆయ‌న కుటుంబాన్ని ఎందుకు ప‌రామ‌ర్శించ‌రు? అంటూ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శ్నించేస్తున్నారు.  బ‌హుశా ఇందులో కూడా ద‌ళిత రాజ‌కీయాన్ని చంద్ర‌బాబు నాయుడు వాడుకోవాల‌ని అనుకుంటున్నారు కాబోలు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తిరిగితే..తెలుగుదేశానికి ఒక ర‌కంగా బాధ‌. ఆఖ‌రికి ప‌రామ‌ర్శ‌కు లేట‌య్యింద‌ని కూడా చంద్ర‌బాబు నాయుడు బాధ‌ప‌డిపోతున్నారు. కొంచెమైనా ఇంగితం ఉన్న వారు మాట్లాడే మాట‌లా ఇవి? అని జ‌నాలు అనుకుంటున్నారు.

చంద్ర‌బాబు కు నిజంగానే వ‌య‌సుతో, కుటుంబ ప‌రమైన నేప‌థ్యంతో మ‌తి చ‌లించింద‌ని.. లేక‌పోతే ఒక ఎంపీ చ‌నిపోయి 48 గంట‌లైనా గ‌డ‌వ‌క‌ముందే.. ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో, త‌ను ఇంట్లో కూర్చుని.. మీరెందుకు వెళ్ల‌లేదు? అంటూ ప్ర‌శ్నిస్తున్న ఆయ‌న‌కు నిజంగానే మెద‌డుకు సంబంధించిన స‌మ‌స్య ఏదో వ‌చ్చింద‌ని సామాన్యులు చ‌ర్చించుకుంటున్నారు.

ఇంట్లో కూర్చుని ఇలాంటి ప‌డ‌క్కుర్చీ క‌బుర్లు ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రు! అయితే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత బాధ్య‌త ఇది కాదు. వాళ్లెక్క‌డ‌, వీళ్లెక్క‌డ‌, వీళ్లెందుకు, వాళ్లెందుకు.. అంటూ కామెంట్లు చేయ‌డానికి వేమూరి రాధాకృష్ణ లాంటి వాళ్లు చంద్ర‌బాబు త‌ర‌ఫున వారం వారం క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నారు. చంద్ర‌బాబు కూడా అదే ప‌ని చేస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించడానికి బ‌దులుగా.. దాదాపు ఏడాది నుంచి అమ‌రావ‌తి త‌ప్ప మ‌రో ఊసులో క‌నిపించ‌ని త‌న పార్టీ ప‌రిస్థితి ఏమిటో చంద్ర‌బాబు కాస్త ఆలోచించుకుంటే మంచిదేమో! త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీ లో ఒక‌రు చ‌నిపోతే దాని మీద కూడా శ‌వ‌రాజ‌కీయం చేస్తున్న చంద్ర‌బాబు.

త‌న పార్టీ లో ఎవ‌రు  ఉన్నారో, ఎవ‌రు పోయారో.. కాస్త చెక్ చేసుకుంటే ఆయ‌న‌కే మంచిదేమో! అస‌లు త‌న పార్టీ అయినా ఉందో లేదో కూడా ఆయ‌న చూసుకునే ప‌రిస్థితుల్లో లేర‌ని, ఆయ‌న బాధంతా అమ‌రావ‌తిలో అడ్ర‌స్ గ‌ల్లంత‌యిన త‌న రియ‌లెస్టేట్ సామ్రాజ్య ప‌త‌నం మీదేన‌నే మాట‌ను అనేక మంది బాహాటంగానే వ్య‌క్తం చేస్తున్నారు.

లేని పోని ఇబ్బందులు అనే ఆలోచనా?