ఇది ఫిక్స్.. బీజేపీ ఉచ్చులో పవన్ చిక్కుకున్నట్టే..!

పవన్ కల్యాణ్ కి ఎవరూ తనకంటే ఎత్తులో ఉండటం ఇష్టం ఉండదు, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సుపీరియారిటీ కావొచ్చు, స్వతహాగా తనకున్న ఇగో కావొచ్చు.. అందుకే ఒంటరిగా ఉన్న జనసేన నాయకుడిగానే ఇన్నాళ్లూ…

పవన్ కల్యాణ్ కి ఎవరూ తనకంటే ఎత్తులో ఉండటం ఇష్టం ఉండదు, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సుపీరియారిటీ కావొచ్చు, స్వతహాగా తనకున్న ఇగో కావొచ్చు.. అందుకే ఒంటరిగా ఉన్న జనసేన నాయకుడిగానే ఇన్నాళ్లూ బండి లాగుతూ వచ్చారు. 

గతంలో బీజేపీ, టీడీపీతో చేతులు కలిపినా.. వ్యక్తిగతంగా తనకు ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు బీజేపీతో పొత్తుకి తహతహలాడుతున్నారు. బీజేపీకి తానెప్పుడూ దూరంకాలేదని సీమలో కబుర్లు చెబుతున్నారు పవన్.

అయితే ఇలాంటి విషయాల్లో బీజేపీ అనేది ఓ పెద్ద డైనోసార్. ఇటువైపు పార్టీ పొత్తు గురించి ఆలోచిస్తే, అటువైపు బీజేపీ ఆ పార్టీని ఎలా మింగేయాలి, తమలో ఎలా కలిపేసుకోవాలి అని ఆలోచిస్తుంటుంది. ఇందులో భాగంగానే టీడీపీని ఖాళీ చేయడానికి ఎత్తులు వేస్తోంది, ఇటు పవన్ కల్యాణ్ ని కూడా కలిపేసుకుని జనసేన, టీడీపీ రెండూ లేకుండా చేయాలనేది బీజేపీ ఆలోచన.

కానీ పవన్ ఇది గ్రహించలేకపోతున్నారు. ఆయనింకా 2014 ఆలోచనలోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఎలాగైతే బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేశారో.. అదే సీన్ రిపీట్ అవుతుందనే భ్రమలో ఉన్నారు. భవిష్యత్తులో అది జరగకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం లాంటి పార్టీనే మింగేయాలని చూస్తోంది కమలం. అలాంటిది జనసేనను తమవైపు లాగేసుకోవడం కాషాయానికి పెద్ద పనేం కాదు. చాక్లెట్ తిన్నంత ఈజీ.

ఎన్నికలలో వచ్చిన భారీ మెజారిటీతో బీజేపీ పూర్తిగా గేమ్ ప్లాన్ మార్చేసింది. కుదిరితే కలిపేసుకోవడం, లేకపోతే పక్కనపెట్టడం అనే కాన్సెప్ట్ తోనే అగి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ మాత్రం ఇంకా పొత్తుల భ్రమల్లోనే ఉన్నారు. బీజేపీ తనకు ఫ్రెండ్ అంటున్నారు. ఏ క్షణానైనా తాను బీజేపీతో కలుస్తాననే హింట్ ఇస్తున్నారు పవన్. అటు బీజేపీ మాత్రం జనసేనను మింగేసే క్షణం కోసం ఎదురుచూస్తోంది.

జనసేనను బీజేపీలో కలిపేసుకొని, పవన్ కు ఏదో ఒక పదవి ఇస్తే సరిపోతుందని అనుకుంటోంది. గతంలో మెగా కాంపౌండ్ లో ఇలాంటి అనుభవం ఒకటి ఉండనే ఉంది. ఇప్పటికే టీడీపీకి చెందిన గల్లీ లీడర్లు మొదలుకొని ఎంపీలందర్నీ లాగేసుకుంటున్న బీజేపీకి జనసేనను కలిపేసుకోవడం పెద్ద పనేం కాదు. పవన్ మాత్రం ఇంకా పొత్తుల ఊహల్లోనే ఉన్నారు.

బీజేపీతో వ్యవహారం కత్తిమీద సాములాంటిది. ముందు పొత్తు అంటారు, తర్వాత పక్కలో బల్లెంలా మారుతారు. మహారాష్ట్ర, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రస్థానం చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. అంతెందుకు, చంద్రబాబును అడిగినా కాషాయం వెనకున్న అసలు రంగు చెబుతారు. పాపం పవన్ మాత్రం అంతదూరం ఆలోచించలేకపోతున్నారు.

అయినా గల్లీకో లీడర్ ను తయారుచేస్తాననే భ్రమలో ఉన్న పవన్ కల్యాణ్ కు ఈ విషయాలు అర్థమవుతాయని అనుకోవడం మరో పెద్ద భ్రమే అవుతుంది.