Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య లైన్ ను వెంకీ వాడేసాడు

బాలయ్య లైన్ ను వెంకీ వాడేసాడు

కోకోకోలా-పెప్పీ అనగానే సినిమా జనాలకు బాలయ్య గుర్తుకు వస్తాడు. కోకోకోలా-పెప్సీ బాలయ్య సెక్సీ అన్నది పాపులర్ టాగ్ లైన్. ఇప్పుడు ఈ ట్యాగ్ లైన్ తో విక్టరీ వెంకటేష్ సినిమా పాట వచ్చేసింది.

మామ-మేనల్లుడు కలిసి నటిస్తున్న వెంకీమామ సినిమా 13న విడుదలకు సిద్దం అవుతోంది. చైతన్య-వెంకీ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ సినిమా నుంచి రెండో పాట బయటకు వచ్చింది.

కోకోకోలా-పెప్సీ..మామ అల్లుడు సెక్సీ అంటూ సాగే ఈపాటను కాసర్ల శ్యామ్ రచించారు. వెంకటేష్ సినిమాలు, చైతన్య సినిమాలు దృష్టిలో పెట్టుకుని, క్యాచీ లైన్స్ తో పాట రాసారు. ఇటీవల ఫుల్ ఫామ్ లో వున్న థమన్ ఓ మాస్ ట్యూన్ ను అందించారు. ట్యూన్ మరీ అద్భుతంగా లేదు కానీ, మాస్ జనాలకు పట్టేలాగే వుంది.

ఫిదాలో వెంకీ-వరుణ్-తమన్నా-మెహరీన్ ల మీద పాట ఫుల్ ప్లస్ అయింది ఆ సినిమాకు. ఇప్పుడు ఈ సినిమాలో వెంకీ-చైతన్య-పాయల్, రాశీఖన్నాల మీద ఈ పాటను చిత్రీకరించారు. బాబీ దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?