cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సొంత అన్నయ్యపై సెటైర్ వేసిన వెంకటేష్

సొంత అన్నయ్యపై సెటైర్ వేసిన వెంకటేష్

వెంకీమామ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో జరిగిన హంగామా అంతాఇంతా కాదు. ఆ రచ్చంతా మనకు తెలిసిందే. దాదాపు ప్రతి అభిమాని సురేష్ బాబును ట్యాగ్ చేస్తూ సెటైర్లు వేశాడు. వెంకీమామ రిలీజ్ ఎప్పుడమ్మా అంటూ ఏడిపించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి స్వయంగా వెంకటేష్ కూడా చేరిపోయాడు. ఏకంగా స్టేజ్ పై ఫన్నీగా మాట్లాడుతూ.. అన్నయ్య సురేష్ బాబుపై సెటైర్ వేశాడు వెంకీ.

"దేవుడా ఓ మంచి దేవుడా.. చాలా థ్యాంక్ దేవుడా. ఫైనల్ గా డిసెంబర్ 13న సినిమా వస్తోంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దేవుడా. ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదు దేవుడా. వెంకీ మామ అన్నారు, మిలట్రీ నాయుడు అన్నారు, రిలీజ్ డేట్ మాత్రం ఇన్నాళ్లు చెప్పలేదు. థ్యాంక్యూ సురేష్ ప్రొడక్షన్స్, థ్యాంక్యూ అన్నయ్య."

ఇలా తన ఫేవరెట్ మూవీ నువ్వునాకు నచ్చావ్ లో సీన్ ను స్పూఫ్ చేస్తూ సురేష్ బాబును ఆటపట్టించాడు వెంకటేష్. ఈరోజు వెంకీమామ ప్రెస్ మీట్ జరిగింది. మైక్ అందుకున్న వెంటనే వెంకీ ఇలా స్పూఫ్ స్టార్ట్ చేయడంతో అంతా ఘొల్లున నవ్వారు. సురేష్ బాబు అయితే తలదించుకొని మరీ ముసిముసిగా నవ్వేశాడు.

స్టేజ్ ఎక్కితే తనకు టెన్షన్ వచ్చేస్తుందని, మాటలు రావని చెప్పే వెంకీ.. ఈసారి మాత్రం ఏకంగా స్టేజ్ పై కామెడీ చేయడం, ఏకంగా సురేష్ బాబుపై సెటైర్లు వేయడం అందర్నీ ఆకర్షించింది. ఈ ఒక్క స్పూఫ్ తో ఇన్నాళ్లూ కోపంతో ఉన్న వెంకీ అభిమానులంతా కూల్ అయిపోయారు.