చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. టీడీపీ వారికి ఇది షాకింగ్ న్యూస్. జీర్ణించుకోలేని వార్తగా ఉంది. పైగా బాబు ఇన్నేసి రోజులు జైలులో ఉండడం అంటే వారికి అసలు ఇబ్బందికరంగానూ ఉంది.
దీంతో తలోరకంగా మాట్లాడుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే చంద్రబాబు వంటి దిగ్గజ నేత అరెస్ట్ అయి జైలులో ఉంటే కేంద్ర పెద్దలు స్పందించరా అని ఘాటైన విమర్శ చేశారు.
అసలు ఏపీలో ఏమి జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయరా అని అడుగుతున్నారు. ఇంకాస్తా ముందుకు వెళ్లి చంద్రబాబు అరెస్ట్ లో కేంద్రం పాత్ర ఏమైనా ఉందా అని తన డౌటానుమానాలను అయ్యన్న వ్యక్తం చేయడం గమనార్హం.
మీరు ఎందుకు స్పందించరు అంటూ అయ్యన్న ఫైర్ అయ్యారు. కేంద్రానికి స్పందించాల్సిన అవసరం ఉందని అయ్యన్న ఆలోచన కాబోలు. చంద్రబాబు అరెస్ట్ అయితే కేంద్ర పెద్దలకు ఏమిటి సంబంధం అన్నది బీజేపీ నేతల నుంచి వస్తున్న సమాధానం. ఏపీలో తాము కూడా విపక్షంలోనే ఉన్నామని అధికార వైసీపీ అరెస్ట్ చేస్తే బీజేపీని రియాక్ట్ కావాలని కోరడం ఏంటి అని అంటున్నారు.
ఇప్పటిదాకా టీడీపీ నేతలలో బీజేపీ పెద్దలు సరిగ్గా స్పందించలేదని బాధ అనుమానాలు కోపాలు ఉన్నా లోపల దాచుకునారు. అంతవరకూ ఎందుకు రాజమండ్రి ప్రెస్ మీట్ లో నారా లోకేష్ ని మీడియా ఇదే విషయం అడిగితే దాన్ని దాటవేస్తూ జాతీయ నాయకులు చాలా మంది స్పందించారు అని చెప్పుకున్నారు. అలా బీజేపీ విషయంలో టీడీపీ పెద్దలు కాస్తా ఆచీ తూచీ మాట్లాడుతూంటే అయ్యన్న మాత్రం బాగానే కెలికి వదిలిపెట్టారు. ఆయన ఫైర్ బ్రాండ్ డైలాగులతో ఇపుడు కేంద్ర పెద్దలు ఎలా రియాక్టు అవుతారు అన్నదే తమ్ముళ్లలో కలుగుతున్న సందేహంగా ఉందిట.