బయటకొచ్చిన రకుల్.. వ్యూహాత్మక అడుగు

తనపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పట్నుంచి సైలెంట్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. మీడియాకు కనిపించడం మాట అటుంచి, కనీసం తన సోషల్ మీడియా పేజీలో కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు ప్రధాని మోడీకి పుట్టినరోజు…

తనపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పట్నుంచి సైలెంట్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. మీడియాకు కనిపించడం మాట అటుంచి, కనీసం తన సోషల్ మీడియా పేజీలో కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మినహా, వారం రోజులుగా ఎలాంటి ట్వీట్లు, పోస్టులు పెట్టలేదు. అలా వ్యూహాత్మకంగా మౌనం వహించిన రకుల్.. ఈరోజు కోర్టు మెట్లు ఎక్కింది.

అవును.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది రకుల్. తనపై మీడియా పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తోందని, ఈ ప్రాపగాండను వెంటనే ఆపాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టును కోరారు. సుశాంత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, అయినప్పటికీ ఓ సెక్షన్ మీడియా తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది రకుల్ తన పిటిషన్ లో పేర్కొంది.

రకుల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది. రకుల్ పిటిషన్ ను ఓ రిప్రజెంటేషన్ గా పరిగణించి.. తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రసారమంత్రిత్వ శాఖకు కూడా కోర్టు సూచించింది.

మొత్తానికి పిటిషన్ వేసిన మొదటిరోజే రకుల్ తను అనుకున్నది సాధించింది. దీని కోసం ఆమె తన షూటింగ్స్ వాయిదా వేసుకుంది. దర్శకుడు క్రిష్ నుంచి ప్రత్యేక అనుమతి పొంది ఈ కేసుపై తనవైపు నుంచి వాదనలకు దిగింది.

ఎన్సీబీ అదుపులో ఉన్న రియా చక్రబొర్తి.. విచారణలో రకుల్, సారా అలీఖాన్ పేర్లను వెల్లడించినట్టు ఓ సెక్షన్ మీడియా ప్రకటించుకుంది. సుశాంత్ తో కలిసి రకుల్, సారా అలీఖాన్ డ్రగ్స్ తీసుకున్నారని, ఎన్సీబీ డిప్యూటీ డైరక్టర్ ఒకరు రకుల్ పేరు ఉందంటూ తమకు చెప్పాడని ఆ మీడియా చెప్పుకుంది. దాదాపు వారం రోజులుగా వస్తున్న ఈ కథనాలకు ఫుల్ స్టాప్ పెడుతూ రకుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

రేపు దీనిపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ మీడియాకు కొన్ని సూచనలు చేయబోతోంది. కేవలం రకుల్ కు సంబంధించి మాత్రమే కాకుండా.. ఈ కేసు మొత్తానికి సంబంధించి కేంద్రం రేపు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. నిజానికి సుశాంత్ కేసు విషయంలో కేంద్రం ఈ పని ఎప్పుడో చేసి ఉంటే బాగుండేది.

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉందా?

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి